iDreamPost
android-app
ios-app

బౌలర్స్‌ని వణికించే స్మిత్ చేతే డ్యాన్స్ వేయించి.. అవుట్ చేశాడు!

  • Published Mar 08, 2024 | 4:32 PM Updated Updated Mar 08, 2024 | 4:32 PM

Ben Sears, Steve Smith: ఎంతో మంది బౌలర్ల చేత రక్త కన్నీరు పెట్టించిన ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఓ కుర్ర బౌలర్‌ డ్యాన్స్‌ ఆడించాడు. తొలి మ్యాచ్‌ ఆడుతూ.. స్మిత్‌ లాంటి మోడ్రన్‌ గ్రేట్‌ను అతన తొలి టెస్ట్‌ వికెట్‌గా సాధించాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Ben Sears, Steve Smith: ఎంతో మంది బౌలర్ల చేత రక్త కన్నీరు పెట్టించిన ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఓ కుర్ర బౌలర్‌ డ్యాన్స్‌ ఆడించాడు. తొలి మ్యాచ్‌ ఆడుతూ.. స్మిత్‌ లాంటి మోడ్రన్‌ గ్రేట్‌ను అతన తొలి టెస్ట్‌ వికెట్‌గా సాధించాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 08, 2024 | 4:32 PMUpdated Mar 08, 2024 | 4:32 PM
బౌలర్స్‌ని వణికించే స్మిత్ చేతే డ్యాన్స్ వేయించి.. అవుట్ చేశాడు!

ఒక వైపు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య చివరిదైన ఐదోవ టెస్టు హోరాహోరీగా సాగుతుంటే.. మరో వైపు న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. శుక్రవారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆసీస్‌-కివీస్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌ను కూడా న్యూజిలాండ్‌ బౌలర్లు కూడా అదే విధంగా అల్లాడిస్తున్నారు. ముఖ్యంగా ఓ కొత్త బౌలర్‌ ఆసీస్‌ టాప్‌ క్లాస్‌ బ్యాటర్‌, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఉన్న స్టీవ్‌ స్మిత్‌ను తన సూపర్‌ బౌలింగ్‌తో డ్యాన్స్‌ ఆడించాడు. అతని బౌలింగ్‌ స్పీడ్‌ను అంచనా వేయలేక స్మిత్‌ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.

న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే అవుట్‌ చేశామని సంతోష పడుతున్న ఆస్ట్రేలియాకు షాక్‌ ఇస్తూ.. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న కివీస్‌ కొత్త బౌలర్‌ బెన్‌ సియర్స్‌ అద్భుతమైన బాల్‌తో స్మిత్‌ను అవుట్‌ చేసి.. తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ను సాధించాడు. అది కూడా స్టీవ్‌ స్మిత్‌ లాంటి స్టార్‌ ప్లేయర్‌ కావడంతో బెన్‌ సియర్స్‌ పేరు ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో మారుమోగిపోతుంది. 2021లో న్యూజిలాండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బెన్‌ సియర్స్‌.. చాలా కాలం తర్వాత న్యూజిలాండ్‌ టెస్ట్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ టెస్ట్‌తోనే అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బెన్‌ సియర్స్‌.. వచ్చిన ఛాన్స్‌ను అద్భుతంగా వినియోగించుకున్నాడు.

ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసిన బెన్‌ సియర్స్‌.. మూడో బంతికి స్టీవ్‌ స్మిత్‌ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నాడు. ఎలాంటి బంతినైనా ఎదుర్కొగల స్మిత్‌.. సియర్స్‌ వేసిన బాల్‌ను మిస్‌ జెడ్జ్‌ చేసి.. ఆడకుండానే ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. అంపైర్స్‌కాల్‌ కూడా బెన్‌ సియర్స్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. అంపైర్‌ నిర్ణయం అటుంచితే.. బెన్‌ సియర్స్‌ బౌలింగ్‌ యాక్షన్‌ కానీ, అతను స్మిత్‌ను అవుట్‌ చేసిన బాల్‌ కానీ, ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 162 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ 38 పరుగులతో టాస్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హెజల్‌వుడ్‌ 5, మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. కమిన్స్‌, కామెరున్‌ గ్రీన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. లబుషేన్‌ 45, నాథన్‌ లియోన్‌ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, బెన్‌ సియర్స్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను అవుట్‌ చేసిన బెన్‌ సియర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.