iDreamPost
android-app
ios-app

మ్యాక్స్‌వెల్‌ సక్సెస్‌ వెనుక భారతీయ మహిళ! ఆమె ఎవరో తెలుసా?

  • Author Soma Sekhar Published - 09:25 PM, Wed - 8 November 23

ప్రతీ మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్న సామెతను మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. తాజాగా మాక్సీ సక్సెస్ వెనక కూడా ఓ భారతీయ మహిళ ఉంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్న సామెతను మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. తాజాగా మాక్సీ సక్సెస్ వెనక కూడా ఓ భారతీయ మహిళ ఉంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 09:25 PM, Wed - 8 November 23
మ్యాక్స్‌వెల్‌ సక్సెస్‌ వెనుక భారతీయ మహిళ! ఆమె ఎవరో తెలుసా?

వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగాడు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్. ఓ వైపు గాయం వేధిస్తున్నప్పటికీ.. జట్టును విజయతీరాలకు చేర్చాలనే మెుక్కవోని దీక్షతో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు మాక్స్ వెల్. ఇక అతడి మెరుపు ఇన్నింగ్ తో ఆసీస్ సెమీస్ లోకి అడుగుపెట్టింది.ఈ ఒక్క ఇన్నింగ్స్ తో మ్యాక్సీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ప్రతీ మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్న సామెతను మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. తాజాగా మాక్సీ సక్సెస్ వెనక కూడా ఓ అమ్మాయి ఉంది. ఆ మహిళ మన ఇండియన్ కావడం గమనార్హం. మాక్స్ వెల్ విజయం వెనక ఉన్నది ఎవరో కాదు.. అతడి భార్య వినీ రామన్.

మాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఆల్ రౌండర్ గా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తక్కువ కాలంలోనే ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్ గా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. అయితే కెరీర్ ఉన్నత దశకు చేరుకున్న తర్వాత మాక్సీకి గాయాల బెడద ఎక్కువైంది. వాటి కారణంగా జట్టులో స్థానం కోల్పోయి కీలక టోర్నీలకు దూరం అయ్యాడు. దీంతో మానసికంగా కుంగుబాటుకు గురైయ్యాడు మాక్స్ వెల్. ఆట నుంచి కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో మాక్స్ వెల్ కు అండగా వెన్నంటే ఉండి అతడిలో ప్రోత్సాహం నింపింది వినీ రామన్. మ్యాక్సీ మానసిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి అహర్నిశలు శ్రమించింది. ప్రతీ క్షణం అతడికి తోడుంటూ.. ఆత్మవిశ్వాసం నింపింది.

ఇక వినీ రామన్ చూపిన ప్రేమాభిమానాలతో మ్యాక్స్ వెల్ మళ్లీ తిరిగి బ్యాట్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో సైతం దుమ్మురేపుతున్నాడు. కీలక మ్యాచ్ లో తన విశ్వరూపం చూపి.. ఆసీస్ ను సెమీస్ కు చేర్చాడు. ఇక ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో 397 పరుగులు చేసి సత్తాచాటాడు. కాగా.. మాక్స్ వెల్ వినీ రామన్ కొత్తకాలం ప్రేమించుకున్నాక 2022లో పెళ్లితో ఒక్కటైయ్యారు. వీరి వివాహం క్రిస్టియన్, హిందూ పద్దతిలో జరిగింది.

కాగా.. వినీ రామన్ తమిళనాడుకు చెందిన వెంకట్ రామన్-విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. వీరు కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు వలస వెళ్లారు. అక్కడే వినీ రామన్ వీరికి పుట్టింది. వృత్తిరిత్యా ఫార్మాసిస్ట్ అయిన వినీ రామన్ కు 2013లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాక్స్ వెల్ తో పరిచయం ఏర్పడింది. ఓ ఫంక్షన్ లో వినీని చూసిన మాక్స్ వెల్ తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడట. ఇక వీరిద్దరు కొంతకాలం డేటింగ్ చేశాక.. మ్యాక్సీ పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో ఆమె అంగీకరించింది. కాగా.. వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. మరి మాక్స్ వెల్ సక్సెస్ వెనక ఉన్న వినీ రామన్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş