కావ్య కోరినట్టే జరుగుతోంది! ఆటగాళ్ల రిటెన్షన్‌పై BCCI కీలక నిర్ణయం?

Kavya Maran, IPL 2025, BCCI, Retain: ఐపీఎల్‌ 2025కి ముందు కావ్య మారన్‌ తన పంతం నెగ్గించుకుంది. మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Kavya Maran, IPL 2025, BCCI, Retain: ఐపీఎల్‌ 2025కి ముందు కావ్య మారన్‌ తన పంతం నెగ్గించుకుంది. మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఈ సీజన్‌కి ముందు మెగా వేలం ఉండటంతో ప్రతి జట్టులో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే.. వేలానికి ముందు ఎంత మంది ఆటగాళ్లను రిటేన్‌ చేసుకోవాలనే విషయంపై ఇటీవల బీసీసీఐ అన్ని టీమ్‌ ఓనర్స్‌తో ఒక మీటింగ్‌ పెట్టింది. అందుకు ప్రతి టీమ్‌ ఓనర్‌ వారి వారి అభిప్రాయాలను, సూచనలు, సలహాలు ఇచ్చారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ కావ్య మారన్‌ కూడా తన అభిప్రాయాన్ని చాలా బలంగా వినిపించింది. కనీసం ఏడుగురు ఆటగాళ్లను రిటేన్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే మెగా ఆక్షన్‌ను ప్రతి మూడేళ్లకు కాకుండా, ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాలని సూచించింది.

కావ్య మారన్‌ సూచనలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఆటగాళ్ల రిటెన్షన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. తాజాగా క్రిక్‌బజ్‌లో కూడా ఆరుగురు ఆటగాళ్లను ప్రతి టీమ్‌ రిటెన్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు మేలు జరగనుంది. ఎందుకంటే.. ఈ మూడు జట్లు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వేలానికి ఆరుగురు ప్లేయర్లను రిటెన్‌ చేసుకుంటే.. కోర్‌ టీమ్‌ను మిస్‌ కాకుండా ఉంటుంది.

అందుకోసమే కావ్య మారన్‌ ఎక్కువ మంది ప్లేయర్లను రిటెన్‌ చేసుకునే అవకాశం కల్పించాలని బీసీసీఐతో జరిగిన మీటింగ్‌లో గట్టిగా కోరింది. అయితే.. ఈ నిర్ణయంతో గత కొన్ని సీజన్లలో బలహీనంగా ఉన్న జట్లు నష్టపోయే అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ టీమ్స్‌ నుంచి కొంతమంది స్టార్‌ ఆటగాళ్లు రిలీజ్‌ అయి.. వేలంలోకి వస్తే.. వాళ్లను ఎలాగైన దక్కించుకుని.. తమ జట్టు తలరాతను మార్చుకుందాం అనుకున్న పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ, లక్నో, ఢిల్లీ లాంటి జట్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments