IPL 2025 కోసం BCCI కొత్త ప్లాన్‌? సెక్రటరీ జైషా ఏమన్నాడంటే?

IPL 2025 కోసం BCCI కొత్త ప్లాన్‌? సెక్రటరీ జైషా ఏమన్నాడంటే?

BCCI, IPL 2025, Jay Shah: ఐపీఎల్‌ 2025 కోసం బీసీసీఐ కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఒక కొత్త ప్లాన్‌తో రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త ఆలోచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

BCCI, IPL 2025, Jay Shah: ఐపీఎల్‌ 2025 కోసం బీసీసీఐ కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఒక కొత్త ప్లాన్‌తో రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త ఆలోచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే వచ్చే సీజన్‌ గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అందుకు కారణం.. ఐపీఎల్‌ 2025 సీజన్‌కి ముందు మెగా వేలం ఉండటమే. ఏ టీమ్‌ ఏ ఆటగాళ్లను రిటేన్‌ చేసుకుంటుంది, ఎవర్ని రిలీజ్‌ చేస్తుందో అని క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ.. కొన్ని రోజుల క్రితం అన్ని ఫ్రాంచైజ్‌ ఓనర్లతో మీటింగ్‌ కూడా నిర్వహించింది. రిటెన్షన్‌ విధానం, మెగా వేలంపై వారితో చర్చలు జరిపి.. వారి అభిప్రాయాలను సేకరించింది.

ఇప్పుడు తాజాగా.. ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌ల పెంపు విషయమై క్రికెట్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచి మొత్తం 84 మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఐపీఎల్‌ 2025, 2026 సీజన్స్‌లో 84 మ్యాచ్‌ల చొప్పున నిర్వహించి.. ఐపీఎల్‌ 2027లో మరో 10 మ్యాచ్‌లు పెంచి.. మొత్తం 94 మ్యాచ్‌లతో లీగ్‌ మోడల్‌లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్‌ రౌండ్‌రాబిన్‌ మోడల్‌లో జరుగుతోంది. మ్యాచ్‌ల సంఖ్యను పెంచితే.. ప్రతి టీమ్‌.. మిగతా అన్ని టీమ్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడేలా ప్లాన్‌ చేస్తోంది బీసీసీఐ. ఇదే విషయాన్ని ఐపీఎల్‌ ఓనర్స్‌తో జరిగిన మీటింగ్‌లో ప్రస్తావిస్తే.. భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని కొంతమంది, వద్దని కొంతమంది అభిప్రాయపడ్డారు. దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందిస్తూ.. ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌ల సంఖ్య పెంచడం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌, ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను దృ ష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటాం అని ఆయన అన్నారు. అలాగే ఫ్రాంచైజీ ఓనర్ల నుంచి వచ్చిన సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని.. మెజార్టీ అభిప్రాయాన్నే అమలు చేస్తామని కూడా పేర్కొన్నారు. మరి ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌ల సంఖ్య పెంచితే మంచిదా? పెంచకుంటే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments