iDreamPost
android-app
ios-app

టీ-20 వరల్డ్ కప్ కోసం BCCI మెరుపులాంటి ఆలోచన! గంభీర్‌కి పిలుపు?

  • Published Apr 04, 2024 | 3:05 PM Updated Updated Apr 04, 2024 | 3:05 PM

Gautam Gambhir, BCCI: ప్రస్తుతం ఐపీఎల్‌ 2024 జోరుగా సాగుతున్న క్రమంలోనే రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దీంతో.. ఈసారి కప్పు మనదే అనే ధీమాలో క్రికెట్‌ అభిమానులు ఉన్నా‍రు. మరి ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, BCCI: ప్రస్తుతం ఐపీఎల్‌ 2024 జోరుగా సాగుతున్న క్రమంలోనే రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దీంతో.. ఈసారి కప్పు మనదే అనే ధీమాలో క్రికెట్‌ అభిమానులు ఉన్నా‍రు. మరి ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 04, 2024 | 3:05 PMUpdated Apr 04, 2024 | 3:05 PM
టీ-20 వరల్డ్ కప్ కోసం BCCI మెరుపులాంటి ఆలోచన! గంభీర్‌కి పిలుపు?

ప్రస్తుతం భారత క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. స్టేడియానికి వస్తే ప్రేక్షకులు ఫోర్లు, సిక్సుల వర్షంలో తడిసిముద్దవుతున్నారు. గతంలో కనీవిని ఎరుగని విధంగా భారీ భారీ రికార్డులు ఈ సీజన్‌లో నమోదు అవుతున్నాయి. బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇలా ఒక వైపు ఐపీఎల్‌ ధూమ్‌ ధామ్‌గా సాగిపోతుంటే.. మరో వైపు బీసీసీఐ మాత్రం ఒక కన్ను రాబోయే టీ20 వరల్డ్‌ కప్ 2024పై కూడా పెట్టింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో భారత ఆటగాళ్లు, బీసీసీఐ ఉంది. అందుకే.. టీమ్‌ ఏం అవసరమో ఇప్పటి నుంచో ప్లానింగ్‌ చేస్తోంది బీసీసీఐ. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ఇంకా సరిగ్గా 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ టైమ్‌లో బీసీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం గౌతమ్‌ గంభీర్‌ను టీమిండియాకు మెంటర్‌గా నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంభీర్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టుకు మెంటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అతని మెంటరింగ్‌లో కేకేఆర్‌ అద్భుతంగా దూసుకెళ్తోంది. ఒక కొత్త టీమ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌గా 2012, 2014 సీజన్స్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ జట్టుకు మెంటర్‌గా వచ్చి.. మళ్లీ కేకేఆర్‌ను సక్సెస్‌ బాటలోనే నడిపిస్తున్నాడు. కేకేఆర్‌ చరిత్రలోనే ఓ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచిన దఖాలా లేదు. అలాంటి టీమ్‌ను ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచేలా తీర్చిదిద్దాడు.

BCCI has a brilliant idea for the T20 World Cup

ఈ సక్సెస్‌ను చూసి.. గంభీర్‌ను మెంటర్‌గా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు టీ20 క్రికెట్‌లో అనుభవం అంతగా లేదు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడినా, రాజస్థాన్‌కు కోచ్‌గా ఉన్నా కూడా.. టీ20 క్రికెట్‌కు ద్రవిడ్‌ కంటే గంభీర్‌ బెటర్‌ అని బోర్డులోని కొంతమంది పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీ20 వరల్డ్‌ కప్‌ 2021కి టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనిని మెంటర్‌గా నియమించిన విషయం తెలిసిందే. కానీ, పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఈసారి గంభీర్‌ను ట్రై చేయాలని బీసీసీఐ బలంగా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మరి టీ20 వరల్డ్‌ కప్‌ కోసం.. గంభీర్‌ను టీమిండియా మెంటర్‌గా నియమిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.