iDreamPost
android-app
ios-app

హెడ్‌ కోచ్‌ ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌! టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు

  • Published Jun 20, 2024 | 5:12 PMUpdated Jun 20, 2024 | 5:12 PM

BCCI, Gautam Gambhir, Raman, Head Coach: టీమిండియాకు ఇద్దరు కోచ్‌లను నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మరి అలా ఎందుకు ఆలోచిస్తోందో ఇప్పుడు చూద్దాం..

BCCI, Gautam Gambhir, Raman, Head Coach: టీమిండియాకు ఇద్దరు కోచ్‌లను నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మరి అలా ఎందుకు ఆలోచిస్తోందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 20, 2024 | 5:12 PMUpdated Jun 20, 2024 | 5:12 PM
హెడ్‌ కోచ్‌ ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌! టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు

రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. ఆయన తర్వాత జట్టును ముందుకు నడిపించేందుకు మంచి కోచ్‌ను పట్టే పనిలో నిమగ్నమైంది బీసీసీఐ. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను భారత జట్టు హెడ్‌ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఫిక్స్‌ అయినట్లు వార్తలు వచ్చాయి.

గంభీర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేయడంతో గంభీర్‌ని ఇంకా ఓకే చేయలేదని విషయం స్పష్టమైంది. గంభీర్‌తో పాటు టీమిండియా అండర్‌ 19 జట్టు, భారత మహిళా జట్టుకు కోచ్‌గా పనిచేసిన రామన్‌ కూడా టీమిండియా హెడ్‌ కోచ్‌ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఇద్దర్ని ఇంటర్వ్యూ చేయగా.. టీమిండియా గురించి గంభీర్‌ తన ప్రణాళికలను వివరించగా.. రామన్‌ సైతం భారత క్రికెట్‌ అభివృద్ధికి ఒక ప్రత్యేక రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రామన్‌ చెప్పిన ప్లాన్‌కు సీఏసీ సభ్యులు ఫిదా అయినట్లు సమాచారం.

దీంతో.. బీసీసీఐ పెద్దలు మళ్లీ పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు గంభీర్‌ను కాదని రామన్‌ను హెడ్‌ కోచ్‌గా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి సేవలు ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే కొత్త ఆలోచన బీసీసీఐ పెద్దలకు వచ్చినట్లు తెలుస్తోంది. గంభీర్‌తో పాటు రామన్‌ సైతం టీమిండియా కోచ్‌గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా చేసి.. రామన్‌ను బ్యాటింగ్‌ లేదా, టెస్టు జట్టు కోచ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారంటా.. దీంతో.. టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు ఉండే అవకాశం ఉంది. అయితే.. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి