టీమిండియాలోకి యువ రక్తం వస్తోంది.. యంగ్ టాలెంటెండ్ ప్లేయర్లు సత్తా చాటుతూ జాతీయ జట్టులోకి దూసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ ఫామ్ తో సతమతమవుతున్న ప్లేయర్లను సాగనంపే పనిలో ఉంది బీసీసీఐ. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్. ఆసియా కప్ 2023 టోర్నీకి శాంసన్ ను ట్రావెలింగ్ రిజర్వ్ గా స్థానం దక్కింది. సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక సంజూను బ్యాకప్ గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి శాంసన్ బీసీసీఐ ఇంటికి పంపినట్లు తెలుస్తోంది.
సంజూ శాంసన్.. టీమిండియా క్రికెట్ లో ఎప్పటికీ హాట్ టాపిక్ గా నిలిచే పేరు. జట్టులో చోటు దక్కినా.. చోటు కోల్పోయినా శాంసన్ ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే సంజూకు అవకాశాలు వస్తున్నప్పటికీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాడు. దీంతో అతడి కంటే వెనక జట్టులోకి వచ్చిన వారు.. టీమ్ లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. సంజూ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. దీంతో శాంసన్ స్థానానికి ఎసరొచ్చింది. ఇక ఆసియా కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో సంజూకు ట్రావెలింగ్ రిజర్వ్ గా స్థానం దక్కింది.
ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరడంతో.. సంజూను బీసీసీఐ ఇంటికి సాగనంపినట్లు సమాచారం. ఇప్పటికే మరో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ బ్యాకప్ గా జట్టులో ఉండటంతో.. శాంసన్ సేవలు చాలు అని అతడిని బీసీసీఐ ఇండియాకు పంపినట్లు తెలుస్తోంది. మరి మళ్లీ శాంసన్ కు ఎప్పుడు జట్టు నుంచి పిలుపొస్తుందో వేచి చూడాలి. కాగా.. గాయం నుంచి కోలుకున్న రాహుల్ రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. గురువారం నుంచి గంటల తరబడి నెట్స్ లో కఠోర శ్రమ చేస్తున్నాడు. ఇక టీమిండియా-పాక్ తో ఆదివారం సూపర్ 4 మ్యాచ్ లో తలపడనుంది. మరి ఆసియా కప్ నుంచి సంజూ శాంసన్ ను బీసీసీఐ ఇంటికి పంపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.