Somesekhar
హెడ్ కోచ్ సెలెక్షన్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లానింగ్ తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే?
హెడ్ కోచ్ సెలెక్షన్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లానింగ్ తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే?
Somesekhar
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ గా ఎవరొస్తారు? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం కోసం భారత ఫ్యాన్స్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఇప్పటికే బీసీసీఐ ప్రకటన కూడా విడుదల చేసింది. మే 27వ తారీఖు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ రేసులో పలు పేర్లు వినిపిస్తున్నారు. అయితే హెడ్ కోచ్ సెలెక్షన్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లానింగ్ తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే?
టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారు అనేది ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఆసక్తికరంగా మారింది. ప్రపంచ క్రికెట్ ను శాసించే టీమిండియాకు హెడ్ కోచ్ గా వ్యవహరించడం చిన్న విషయమేమీ కాదు. అందుకే బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక హెడ్ కోచ్ సెలెక్షన్ కోసం మహేంద్రసింగ్ ధోని సాయం బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా ఉన్న కివీస్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ ను భారత కోచ్ గా తీసుకోవడానికి బీసీసీఐ మెుగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ధోనిని రంగంలోకి దించింది. ఫ్లెమింగ్ ను ఎలాగైనా ఒప్పించాలని ధోనిని కోరినట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ హెడ్ కోచ్ పదవి గురించి ఫ్లెమింగ్ తో చర్చే జరగలేదని స్పష్టం చేశాడు. అదీకాక హెడ్ కోచ్ పదవికి అసలు ఈ కివీస్ దిగ్గజం అప్లై చేసుకున్నాడా? లేడా? అన్నది తెలీదు. అయితే టీమిండియా ప్లేయర్ల మనస్తత్వం తెలిసిన ఫ్లెమింగ్ లాంటి సీనియర్లు అయితేనే బెటర్ అని బీసీసీఐ భావిస్తోంది. ఇక స్టీఫెన్ తో పాటుగా కోచ్ రేసులో మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్థనే, టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్, ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈసారి విదేశీ కోచ్ ను తీసుకునేందుకే మెుగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరి మహేంద్రసింగ్ ధోని బీసీసీఐ కోసం స్టీఫెన్ ఫ్లెమింగ్ ను ఒప్పిస్తాడా? లేదా? వేచిచూడాలి. మరి టీమిండియా హెడ్ కోచ్ గా ఎవరైతే బాగుంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The BCCI might seek help from MS Dhoni to convince Stephen Fleming to apply for India’s Head Coach position. (Hindustan Times). pic.twitter.com/112JNUCA1x
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024