iDreamPost
android-app
ios-app

Jay Shah: BCCI సెక్రటరీ జైషాకు అరుదైన గౌరవం!

  • Published Dec 05, 2023 | 4:02 PM Updated Updated Dec 05, 2023 | 4:02 PM

ఇండియాలోనే క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది దేశానికి ప్రాతినిథ్యం వహించే క్రికెట్‌ టీమ్‌ను చూసుకునే క్రికెట్‌ బోర్డును నడిపించడం అంటే మాటలు కాదు. ఆ బాధ్యతలో ఉన్న జైషాకు తాజాగా ఓ అవార్డు వరించింది. అదేంటో.. ఎందుకిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలోనే క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది దేశానికి ప్రాతినిథ్యం వహించే క్రికెట్‌ టీమ్‌ను చూసుకునే క్రికెట్‌ బోర్డును నడిపించడం అంటే మాటలు కాదు. ఆ బాధ్యతలో ఉన్న జైషాకు తాజాగా ఓ అవార్డు వరించింది. అదేంటో.. ఎందుకిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 05, 2023 | 4:02 PMUpdated Dec 05, 2023 | 4:02 PM
Jay Shah: BCCI సెక్రటరీ జైషాకు అరుదైన గౌరవం!

బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) కార్యదర్శి జైషాకు ఒక అరుదైన అవార్డు వరించింది. దాదాపు మూడేళ్లుగా బీసీసీఐ సెక్రటరీగా క్రికెట్‌కు సేవలందిస్తున్న జైషాకు, ఆయన సేవలకు గుర్తింపుగా సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఈ అవార్డు అందుకున్న తొలి స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వ్యక్తిగా జైషా నిలిచారు. జైషా.. భారత హోం మంతి అమిత్‌ షా కుమారుడు అనే విషయం తెలిసిందే. 2019లో బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన జైషా.. అప్పటి నుంచి ఎంతో సమర్థవంతంగా బీసీసీఐని ముందుకు నడిపిస్తున్నారు.

ఆయన హయంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్ర వేస్తోంది. అలాగే బీసీసీఐలో పలు విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకొచ్చారు. మహిళ, పురుష క్రికెటర్లకు సమాన వేతనం కూడా అందిస్తున్నారు. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ నిర్వహణ, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వేనుక కూడా జైషా కృషి ఎంతో ఉంది. బీసీసీఐని క్రికెట్‌ ప్రపంచంలో ఒక తిరుగులని శక్తిగా నిలుపుతున్నాడు జైషా. కాగా, ఆయనకు క్రికెట్‌ ఆడిన అనుభవం లేకపోయినా.. ప్రతిష్టాత్మక బీసీసీఐ సెక్రటరీ పదవి దక్కడంపై కూడా విమర్శలు ఉన్నా.. వాటంటిని దాటుకుని ఎంతో సమర్థవంతంగా ఆయన ఆ పదవిని నిర్వర్తిస్తున్నారు.

కాగా, ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం ఎంతో అద్భుతంగా ఆడిన టీమిండియా.. వరుసగా పది మ్యాచ్‌లు నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాను టోర్నీ ఆరంభంలోనే తొలి మ్యాచ్‌లోనే ఓడించిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం అదే ఆస్ట్రేలియాపై చేతులెత్తేసింది. ఈ ఓటమి భారత క్రికెట్‌ అభిమానులను ఎంతో భావించింది. కానీ, టీమిండియా టోర్నీ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చడంతో.. ఆటగాళ్లపై ఎలాంటి విమర్శలకు దిగలేదు అభిమానులు. ఓటమి బాధలో ఉన్న వారికి మద్దుతుగా నిలబడ్డారు. అటు బీసీసీఐపై కూడా విమర్శలు ఏం రాలేదు. వరల్డ్‌ కప్‌ టోర్నీని ఎంతో అద్భుతంగా నిర్వహించిన బీసీసీఐపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. మరి బీసీసీఐని ఇంత సమర్థవంతంగా నడిపిస్తున్న బీసీసీఐ సెక్రటరీ జైషాకు సీఐఐ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.