iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: టీ20లకు రిటైర్మెంట్‌.. వన్డేల నుంచి తొలగింపు! జడేజా కెరీర్‌కు BCCI పుల్‌స్టాప్‌?

  • Published Jul 19, 2024 | 1:18 PMUpdated Jul 19, 2024 | 1:18 PM

BCCI, Ravindra Jadeja, IND vs SL: టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ అతని వన్డే కెరీర్‌కు కూడా పుల్‌ స్టాప్‌ పెట్టింది. మరి అలా ఎందుకు చేసిందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కెరీర్‌ దాదాపు ముగిసిపోయినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా టీమ్‌లో ఒక సీనియర్‌ ప్లేయర్‌ అనే ట్యాగ్‌తో నెట్టుకొస్తున్న జడేజాను ఎట్టకేలకు సెలెక్టర్లు పక్కనపెట్టేశారు. చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేని జడేజాను అనవసరంగా ఆడిస్తున్నారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలకు ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ, వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతాను అన్నాడు. ఇంతలోనే అతనికి బీసీసీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రెస్ట్‌కు తీసుకుంటాం అని చెప్పిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు రెస్ట్‌ ఇవ్వకుండా సిరీస్‌ ఆడాల్సిందే అని ఆడిస్తున్న బీసీసీఐ.. జడేజాను మాత్రం పూర్తిగా పక్కనపెట్టేసింది. యువ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే అద్భుతంగా రాణిస్తుండటంతో ఇకపై టీమిండియాలో జడేజా అంకం ముగిసినట్లే అని క్రికెట్‌ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

పైగా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం టీ20 వరల్డ్‌ కప్‌ 2026, వన్డే వరల్డ్‌ కప్‌ 2027ను టార్గెట్‌గా పెట్టుకొని కొత్త టీమ్‌ను నిర్మించాలనే కసితో ఉన్నాడు. అంతకంటే ముందు గంభీర్‌ ముందున్న టార్గెట్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరీలో జరగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025. ఈ ట్రోఫీని ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న గంభీర్‌.. టీమ్‌కు భారమైన ఆటగాళ్లను పక్కనపెట్టేయాలని బీసీసీఐకి గట్టి సూచన చేసినట్లు సమాచారం. అందులో భాగంగా రవీంద్ర జడేజాను వన్డేలకు సైతం పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక జడేజా కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. మరి జడేజా కెరీర్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి