SNP
IND vs SL, BCCI: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ కోసం జట్ల ఎంపికతో ఓ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్‌కు బీసీసీఐ ఎండ్ కార్డ్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
IND vs SL, BCCI: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ కోసం జట్ల ఎంపికతో ఓ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్‌కు బీసీసీఐ ఎండ్ కార్డ్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో ఈ నెల 27 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనుంచి భారత జట్టు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు గురువారం జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ఎంపికతో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది బీసీసీఐ. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన టీ20 కెప్టెన్సీ పోస్ట్‌ను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. అలాగే టీ20, వన్డేల్లో శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌ను చేసింది. ఈ నిర్ణయంతో హార్ధిక్ పాండ్యాతో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్యర్యపోయి ఉంటారు. అలాగే ఈ జట్ల ఎంపికతో ఓ 26 ఏళ్ల యంగ్ క్రికెటర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ క్రికెట్ మరెవరో కాదు.. ఇషాన్ కిషన్. సరిగ్గా ఏడాదిన్నర క్రితం టీమిండియా తరఫున ఆడుతూ వన్డేల్లో ఏకంగా ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ అతను. అలాంటి హైలీ టాలెంటెడ్ ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయినట్లు కనిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023కు ఎంపికైన ఆటగాడు.. ఇప్పుడు అసలు జట్టు ఎంపికకు కనీసం పరిగణలో కూడా లేడు. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే.. అందుకు ఇషాన్ కిషన్ చేసుకున్న స్వయంకృత అపరాధమే కారణం అంటున్నారు క్రికెట్ నిపుణులు. టీమిండియా తరఫున ఆడమంటే.. అలసిపోయాను, తనకు రెస్ట్ కావాలని చెప్పి.. దుబాయ్‌లో పార్టీలకు, కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి టీవీ షోలకు వెళ్లడంతో బీసీసీఐ అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. జట్టు నుంచే కాకుండా ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. అతనితో పాటు శ్రేయస్ అయ్యర్‌ను కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించినా.. అతన్ని శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. కానీ, ఇషాన్ కిషన్‌ను కనీసం లెక్కలోకి తీసుకోలేదు.
పైగా టీమిండియాలో ఓపెనింగ్ స్థానం కోసం యుశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ క్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఇషాన్ కిషన్‌కు ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కడం కష్టంగానే మారింది. ఓపెనింగ్ స్థానానికి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య అద్భుతంగా ఆడుతున్న గైక్వాడ్ లాంటి ప్లేయర్‌కే చోటు దక్కకుండా పోయింది. రోహిత్ ఉన్నంత కాలం వన్డేల్లో ఒక ఓపెనింగ్ ప్లేస్ ఫిక్స్ అయినట్లే. ఇక తాజాగా గిల్ వైస్ కెప్టెన్ కావడంతో అతన్ని కదిలించడం కూడా కష్టమే. వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా.. జైస్వాల్ ఉన్నాడు. అతను కూడా లేకుంటా గైక్వాడ్ ఉన్నాడు. ఇంత మందిని దాటుకుని ఇషాన్ కిషన్ రావడం కష్టం. ఇక ఇషాన్ ఐపీఎల్‌లో ఆడుకోవడమే అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఇషాన్ కిషన్ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Fastest double hundred in ODIs
– 82(81) vs PAK in Asia Cup
– IPL winner
– Fifty in WI in Test series debutHappy birthday wishes to one of the most exciting young talents, Ishan Kishan. 🌟 🇮🇳 pic.twitter.com/wTWJTFsBvo
— Johns. (@CricCrazyJohns) July 18, 2024