Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024ను ఎలాగైనా సాధించాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసింది. అందులో భాగంగా టోర్నీ బరిలోకి ధోనిని దింపాలని చూస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ 2024ను ఎలాగైనా సాధించాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసింది. అందులో భాగంగా టోర్నీ బరిలోకి ధోనిని దింపాలని చూస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2024 సీజన్ ముగిసిన తర్వాత.. మరో మహాసంగ్రామానికి తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే కసితో టీమిండియా రగిలిపోతోంది. అదీకాక టీమిండియా ప్లేయర్లు ప్రస్తుత ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నారు. మరోవైపు బీసీసీఐ సైతం ఎలాగైనా భారత్ ను విశ్వవిజేతగా నిలపాలని చూస్తోంది. ఇందుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక బీసీసీఐ తన మాస్టర్ ప్లాన్ తో టీ20 వరల్డ్ కప్ లోకి ధోనిని దింపాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం టీమిండియా టార్గెట్ టీ20 వరల్డ్ కప్ 2024. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని బీసీసీఐ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా సెలెక్టర్లకు పటిష్టమైన టీమ్ ను ఎంపిక చేయాలని సూచనలు కూడా చేసింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. టీమిండియా మాజీ క్రికెటర్ల అభిప్రాయాలను, వారి సూచనలను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దానికోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని తిరిగి టీమిండియాలో భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. మెంటర్ గా ధోనికి పగ్గాలు అప్పగించాలని, తద్వారా అతడి అనుభవాన్ని పొంది, కప్ కొట్టాలన్నది బీసీసీఐ ప్లాన్.
అయితే ధోని ఇందుకు ఒప్పుకుంటాడా? అన్నది ఇప్పుడు బీసీసీఐ ముందున్న అసలు ప్రశ్న. దీంతో పాటుగా ధోనిని తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందని జోరుగా క్రికెట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత.. ఆ బాధ్యతలను ధోనికి అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే ప్రస్తుతం మిస్టర్ కూల్ ను టీమ్ కు మెంటర్ గా నియమించాలని చూస్తోంది. అయితే.. 2021 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు మెంటర్ గా వ్యవహరించాడు ధోని. కానీ ఆ టోర్నీలో భారత్ సత్తా చాటలేక, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. మరి ఈసారైనా మెంటర్ గా పగ్గాలు అందుకుని టీమిండియాకు మరో పొట్టికప్ ను ధోని అందిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.