SNP
Ruturaj Gaikwad, Yuzvendra Chahal, BCCI, IND vs SL: బీసీసీఐ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్లను చూస్తే.. ఓ ముగ్గురు ఆటగాళ్లుకు తీవ్ర అన్యాయం చేసినట్లే కనిపిస్తోంది. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Ruturaj Gaikwad, Yuzvendra Chahal, BCCI, IND vs SL: బీసీసీఐ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్లను చూస్తే.. ఓ ముగ్గురు ఆటగాళ్లుకు తీవ్ర అన్యాయం చేసినట్లే కనిపిస్తోంది. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంక పర్యటనకు కోసం ఎంపిక చేసిన జట్లతో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పిన బీసీసీఐ.. కొన్ని ఊహించని షాకులు కూడా ఇచ్చింది. రోహిత్ శర్మ తర్వాత ఖాళీ అయిన టీ20 కెప్టెన్సీ పోస్టును సూర్యకుమార్ యాదవ్‌తో భర్తీ చేసింది. అలాగే గతంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాను తప్పించి అతని స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అలాగే వన్డేల్లో కూడా శుబ్‌మన్ గిల్‌నే వైస్ కెప్టెన్ చేసింది. అయితే.. అందరు అనుకున్నట్లుగా హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ ఇవ్వకుండా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. అలాగే శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన టీమ్స్‌తో కొంతమంది ఆటగాళ్లకు గుండె పగిలే షాక్ ఇచ్చింది.
ఎంతో టాలెంట్ ఉండి, టీమిండియాలో స్థిరమైన స్థానం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆటగాడికి బీసీసీఐ దారుణంగా దెబ్బేసింది. ఆ ఆటగాడు ఎవరో కాదు.. రుతురాజ్ గైక్వాడ్. అద్భుతమైన టాలెంటెడ్ క్రికెటర్, ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో ఆడాగల సత్తా ఉన్నోడు. అలాగే లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. అవసరమైన సమయంలో వేగంగా, నిదానంగా ఆడుతూ పార్ట్నర్‌షిప్‌లో నిర్మించగల ఆటగాడు. ఇక ముక్కలో చెప్పాలంటే టీమిండియాలో మరో కోహ్లీ అయ్యే దమ్మున్నోడు. కానీ, ఏం లాభం అతనికి శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఏ ఒక్క జట్టులో కూడా చోటు దక్కలేదు. రుతురాజ్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో రుతురాజ్ అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 66.50 యావరేజ్, 158.33 స్ట్రైక్‌రేట్‌తో 133 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో 77, మూడో మ్యాచ్‌లో 49 పరుగులు చేసి రాణించాడు. అయినా కూడా చివరి టీ20లో రుతురాజ్‌ను పక్కనపెట్టారు. జింబాబ్వే సిరీస్‌లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్‌కు మాత్రం శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. రుతురాజ్‌తో పాటు అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌కు కూడా బీసీసీఐ అన్యాయం చేసిందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వే సిరీస్‌తో సెంచరీతో చెలరేగి అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మకు శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పక్కనపెట్టారు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక చేసిన చాహల్‌ను ఇప్పుడు మళ్లీ డ్రాప్ చేశారు. ఇలా బీసీసీఐ ఈ ముగ్గురు ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HARSH ON RUTURAJ GAIKWAD…!!!
– Rutu has given everything whenever he got the opportunity but not even in the backup openers option in T20I in Sri Lanka series. pic.twitter.com/DqsdKRsNzz
— Johns. (@CricCrazyJohns) July 18, 2024