Yuvraj Singh: యువరాజ్​ను అవమానించిన BCCI.. వరల్డ్ కప్​ హీరోకు దక్కని గౌరవం!

వరల్డ్ కప్ హీరో, లెజెండ్ యువరాజ్ సింగ్​కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. తన ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో కోట్లాది మంది క్రికెట్ లవర్స్ హృదయాల్లో అతడు చెరగని స్థానం సంపాదించుకున్నాడు.

వరల్డ్ కప్ హీరో, లెజెండ్ యువరాజ్ సింగ్​కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. తన ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో కోట్లాది మంది క్రికెట్ లవర్స్ హృదయాల్లో అతడు చెరగని స్థానం సంపాదించుకున్నాడు.

వరల్డ్ కప్ హీరో, లెజెండ్ యువరాజ్ సింగ్​కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. తన ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో కోట్లాది మంది క్రికెట్ లవర్స్ హృదయాల్లో అతడు చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్-2007​ను భారత్ అందుకోవడంలో అతడిది కీలక పాత్ర. అరంగేట్ర పొట్టి ప్రపంచ కప్​లో ఇంగ్లండ్​పై యువీ ఆడిన ఇన్నింగ్స్​ను ఎవరు మర్చిపోగలరు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ, ఒకే ఓవర్​లో 6 సిక్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ వరల్డ్ కప్​తో పాటు 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్​లో అతడు చెలరేగి ఆడాడు. బ్యాటింగ్​లో పరుగుల వరద పారిస్తూనే, బౌలింగ్​లో వికెట్ల పండుగ చేసుకున్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్​తోనూ జట్టు విజయాల్లో మెయిన్ రోల్ పోషించాడు.

రెండు ప్రపంచ కప్​ల హీరో అయిన యువరాజ్​ సింగ్​ను బీసీసీఐ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే సమయంలో టీమిండియా తరఫున 12వ నంబర్ జెర్సీ వేసుకొని బరిలోకి దిగేవాడు. అతడి పుట్టిన రోజు డిసెంబర్ 12. దీంతో అదే నంబర్ జెర్సీ వేసుకొని ఆడేవాడు. యువీ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాక ఆ జెర్సీని ఎవరికీ ఇవ్వలేదు భారత క్రికెట్ బోర్డు. కొన్ని టెస్ట్ మ్యాచుల్లో బ్యాటర్ పృథ్వీ షా అదే నంబర్ జెర్సీతో ఆడాడు. అయితే యువీ గౌరవార్థం దాన్ని మార్చేసి.. ఇతర నంబర్​కు షిఫ్ట్ అయ్యాడు. దీంతో యువీ జెర్సీ నంబర్ అలాగే ఉండిపోయింది. దానికి రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ బోర్డు ఆ పని చేయలేదు.

లెజెండరీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ 10వ నంబర్ జెర్సీ, మహేంద్ర సింగ్ ధోని 7వ నంబర్ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక మీదట భారత్​కు ఆడే ఏ ఆటగాడు కూడా ఈ నంబర్ జెర్సీలతో బరిలోకి దిగడానికి వీల్లేదు. అయితే ధోని, సచిన్ విషయంలో గౌరవప్రదంగా వ్యవహరించిన బోర్డు.. యువీని అవమానించడం చర్చనీయాంశంగా మారింది. జింబాబ్వే సిరీస్​కు ఎంపికైన యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్​కు 12వ నంబర్ జెర్సీని ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పరాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ జెర్సీతో ఉన్న ఫొటోను అతడు పంచుకున్నాడు. దీంతో యువరాజ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ధోనీతో పోల్చుకుంటే యువీకి ఏం తక్కువని, అతడు లేకుంటే రెండు వరల్డ్ కప్స్ వచ్చేవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది యువరాజ్​ను అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. వెంటనే పరాగ్ జెర్సీ నంబర్​ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. జెర్సీ విషయంలో యువీతో బోర్డు వ్యవహరిస్తున్న తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments