Jasprit Bumrah: బుమ్రాను అవమానించిన BCCI! సన్మాన కార్యక్రమంలో ఇది గమనించారా?

వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్లకు వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానం చేసింది బీసీసీఐ. అయితే ఆ వేడుకలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అవమానం జరిగింది. అసలు ఏం జరిగిందంటే?

వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్లకు వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానం చేసింది బీసీసీఐ. అయితే ఆ వేడుకలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అవమానం జరిగింది. అసలు ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ప్లేయర్లకు స్వదేశంలో అఖండ స్వాగతం లభించింది. ముంబై వీధుల్లో విజయోత్సవ ర్యాలీ అద్భుతంగా జరిగింది. ప్రపంచ కప్ సాధించిన వీరులను చూడటానికి, అభినందించడానికి లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. దాంతో ముంబై రోడ్లు జన సంద్రాన్ని తలపించాయి. విన్నింగ్ పరేడ్ ముగిసిన తర్వాత వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు ఘనంగా సన్మానం చేసింది బీసీసీఐ. అయితే ఈ సన్మాన కార్యక్రమంలో టీమిండియా స్టార్ బౌలర్, వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా విషయంలో బీసీసీఐ ఓ తప్పు చేసి.. అతడిని అవమానించింది. అసలు ఏం జరిగిందంటే?

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లను, సిబ్బందిని ఘనంగా సన్మానించింది బీసీసీఐ. ఈ వేడుక గురువారం రాత్రి వాంఖడే స్డేడియంలో అట్టహాసంగా జరిగింది. స్టేడియం మెుత్తం అభిమానులతో నిండిపోయింది. ఆటగాళ్లు డ్యాన్స్ లతో రెచ్చిపోయారు. టీమిండియా ప్రపంచ కప్ గెలవడం, తమ అభిమాన ఆటగాళ్లు కళ్ల ముందే ఉండటంతో.. అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక టీమిండియాకు ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాను కూడా అందించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కాగా.. ఈ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఓ వీడియోను ప్రసారం చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా కప్ కొడుతుందని జై షా అన్న మాటలతో పాటుగా.. టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియో అందులో ఉంది. ఇందులో రోహిత్, విరాట్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే లు ఈ వీడియో కనిపించారు. కానీ వరల్డ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు వీడియో ఇందులో ప్రసారం కాలేదు. ఇది అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యర్థి టీమిండియాపై పైచేయి సాధించిన ప్రతీసారి జట్టును తిరిగి మ్యాచ్ లోకి తీసుకొచ్చి.. విజయాలు అందించాడు బుమ్రా. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా దక్కించుకున్నాడు.  అలాంటిది అతడి వీడియోనే ప్రసారం కాకపోయేటప్పటికీ.. అందరూ షాక్ తిన్నారు.

అయితే ఇది గమనించిన విరాట్ కోహ్లీ.. బుమ్రాకు ఫుల్ క్రెడిట్ ఇచ్చాడు. ఇతడి వల్లే వరల్డ్ కప్ గెలిచామని చెప్పి.. అక్కడున్న వారందరి చేత చప్పట్లు కొట్టించాడు. ఇక ఈ విషయంపై బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రతీ మ్యాచ్ లో కీలక వికెట్లు తీసి గెలిపించిన బుమ్రాకు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున వీడియో మిస్ అయ్యింటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments