Nidhan
టీమిండియా హెడ్ కోచ్ సెలెక్షన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పోస్ట్ కోసం బీసీసీఐ ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే గంభీర్‌తో పాటు మరో దిగ్గజాన్ని బోర్డు ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా హెడ్ కోచ్ సెలెక్షన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పోస్ట్ కోసం బీసీసీఐ ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే గంభీర్‌తో పాటు మరో దిగ్గజాన్ని బోర్డు ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Nidhan
టీమిండియా హెడ్ కోచ్ సెలెక్షన్ అంశం గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారింది. పొట్టి కప్పు మొదలైనప్పటి నుంచి దీని గురించి బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మెగా టోర్నీతో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తి కానుండటంతో కొత్త కోచ్ కోసం అన్వేషణను ప్రారంభించింది భారత క్రికెట్ బోర్డు. కోచ్ రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే అందరికంటే ఎక్కువగా భారత దిగ్గజం గౌతం గంభీర్ పేరు మార్మోగింది. దీంతో అతడ్నే కోచ్‌గా తీసుకోనున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ నెలాఖరులో దీనిపై అధికారిక ప్రకటన రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించింది బీసీసీఐ.
కోచ్ పోస్ట్ కోసం ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించింది భారత బోర్డు. అయితే గంభీర్ ఒక్కడే ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యాడని మొదట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇది దారుణమని.. అతనొక్కడ్నే ఎలా ఇంటర్వ్యూ చేస్తారని, ఇంకా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గౌతీని కోచ్‌గా తీసుకోవాలని బోర్డు పెద్దలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారని.. అందుకే ఈ నాటకం ఆడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. అయితే గంభీర్‌తో పాటు మరో లెజెండ్ డబ్ల్యూవీ రామన్‌ను కూడా బీసీసీఐ ఇంటర్వ్యూ చేసింది. నిన్నటి వరకు రేసులో లేని రామన్.. హఠాత్తుగా ఇంటర్వ్యూకు అటెండ్ అవడంతో ఆయన గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌతీకి పోటీని ఇస్తున్న ఈ రామన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
డబ్ల్యూవీ రామన్ అంటే ఇప్పటితరం అభిమానులకు అంతగా తెలియదు. కానీ 90వ దశకంలో క్రికెట్ చూసేవారికి మాత్రం ఆయన సుపరిచితుడే. 59 ఏళ్ల రామన్ భారత్ తరఫున 1988 జనవరి 11న అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో తన కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఆయన పూర్తి పేరు వూర్కెరీ రామన్. 1988 నుంచి 1997 మధ్య టీమిండియా తరఫున 11 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 448 పరుగులు, వన్డేల్లో 617 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ కెరీర్ కంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రామన్‌కు ఘనమైన రికార్డులు ఉన్నాయి. దేశవాళీల్లో 132 మ్యాచుల్లో 7,939 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోరు 313గా ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 85 వికెట్లు కూడా అతడి పేరు మీద ఉన్నాయి. భారత మహిళల జాతీయ జట్టుకు 2018 నుంచి 2021 వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం రామన్ సొంతం. ప్లేయర్‌గా, కోచ్‌గా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న రామన్‌ను బోర్డు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.
Gautam Gambhir and WV Raman two candidates interviewed today by the BCCI for Team India’s Head coach post. (Sahil Malhotra from News18).
– An Overseas candidate is likely to be interviewed tomorrow. pic.twitter.com/sjI2Q2ge5C
— Tanuj Singh (@ImTanujSingh) June 18, 2024