iDreamPost
android-app
ios-app

ధోని మరో సీజన్‌లో ఆడాలంటే.. ఆ రూల్‌ ఉంచండి! BCCIకి రాయుడి సలహా

  • Published May 20, 2024 | 12:30 PM Updated Updated May 20, 2024 | 12:30 PM

BCCI, MS Dhoni, Ambati Rayudu, IPL 2024: ఈ సీజన్‌లో ఇక ధోని బ్యాటింగ్‌ చూసే భాగ్యం ముగిసింది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో.. ధోని ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అయితే.. వచ్చే సీజన్‌లో కూడా ధోని ఆడాలంటే.. బీసీసీఐకి రాయడు ఒక సలహా ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

BCCI, MS Dhoni, Ambati Rayudu, IPL 2024: ఈ సీజన్‌లో ఇక ధోని బ్యాటింగ్‌ చూసే భాగ్యం ముగిసింది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో.. ధోని ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అయితే.. వచ్చే సీజన్‌లో కూడా ధోని ఆడాలంటే.. బీసీసీఐకి రాయడు ఒక సలహా ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 20, 2024 | 12:30 PMUpdated May 20, 2024 | 12:30 PM
ధోని మరో సీజన్‌లో ఆడాలంటే.. ఆ రూల్‌ ఉంచండి! BCCIకి రాయుడి సలహా

ఐపీఎల్‌ 2024లో లీగ్‌ దశ ముగిసి.. కీలకమైన ప్లే ఆఫ్స్‌ దశ మొదలైంది. 10 టీమ్స్‌ తమ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఎక్కువ విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ 4లో నిలిచిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లాయి. మిగిలిన ఆరు జట్లు ఎలిమినేట్‌ అయ్యాయి. కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌ఆర్‌, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. తొలి నుంచి ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందని భావించిన సీఎస్‌కే ఇంటి బాట పట్టింది. దీంతో.. ఈ సీజన్‌లో దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆట చూసే అవకాశం కూడా అయిపోయింది. అయితే.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు ధోని వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ఆడాలని కోరుకుంటున్నారు. ఇదే విషయంపై తాజాగా అంబటి రాయుడు కూడా స్పందించాడు.

ధోని వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ 2025 కూడా ఆడాలని కోరాడు. అయితే.. ధోని అలా ఆడాలి అంటే.. అందుకోసం బీసీసీఐ కచ్చితంగా ఒక పని చేయాలని సూచించాడు. అదేంటంటే.. ఐపీఎల్‌లో రెండేళ్లుగా కొనసాగిస్తున్న ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను ఈ సీజన్‌లో కూడా కొనసాగించాలని రాయుడు కోరాడు. ఆ రూల్‌ ఉంటే ధోని వచ్చే సీజన్‌లో కూడా ఆడే అవకాశం ఉందని, ధోని ఆటను వచ్చే సీజన్‌లో కూడా చూడాలనుకుంటే.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను తీసేయకుండా కొనసాగించాలని అన్నాడు. అయితే.. ధోనికి ఇదే చివరి సీజన్‌ అనే ప్రచారం టోర్నీ ఆరంభానికి ముందు జరిగింది. కానీ, ధోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆర్సీబీతో మ్యాచ్‌ కంటే ముందు.. చెన్నై వేదికగా మ్యాచ్‌ ఆడిన సీఎస్‌కే ఆటగాళ్లు గ్రౌండ్‌ అంతా తిరుగుతూ.. తమ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.

ఆ టైమ్‌లో ధోని బాల్స్‌ను ప్రేక్షకులకు అందించి.. తన వీడ్కోల కార్యక్రమంలా వ్యవహరించాడు. కానీ, ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ సీజన్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా.. క్రికెట్‌ అభిమానులకు, ముఖ్యంగా తన అభిమానులకు కన్నుల పండవలాంటి మంచి మంచి షాట్స్‌ కొట్టాడు. వింటేజ్‌ ధోనిని పరిచయం చేస్తూ.. భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. కానీ, వెన్నునొప్పి, కాలి కండాల నొప్పితో బాధపడుతూ.. ఆడాడు అనే విషయం తెలిసిందే. పైగా కెప్టెన్సీ కూడా రుతురాజ్‌కు అప్పగించడంతో ఇదే ధోని చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని అంతా ఫిక్స్‌ అయిపోయారు. కానీ, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ కొనసాగిస్తూ.. ఓన్లీ బ్యాటింగ్‌ చేస్తూ వచ్చే సీజన్‌లో ధోని ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉందని, అందుకే ఆ రూల్‌ను రద్దు చేయకుండా కొనసాగించాలని రాయుడు కోరాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.