iDreamPost
android-app
ios-app

టీమిండియాలో ఆ ఒక్కడికి అన్యాయం! కప్ గెలిపించే సత్తా ఉన్నా పక్కన పెట్టారు!

Team India Squad For T20 WC 2024: బీసీసీఐ వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్స్, నలుగురు స్టాండ్ బైతో ఒక టీమ్ ను ప్రకటించారు. అయితే జట్టులో ఒక్కడికి చోటు లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Team India Squad For T20 WC 2024: బీసీసీఐ వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్స్, నలుగురు స్టాండ్ బైతో ఒక టీమ్ ను ప్రకటించారు. అయితే జట్టులో ఒక్కడికి చోటు లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియాలో ఆ ఒక్కడికి అన్యాయం! కప్ గెలిపించే సత్తా ఉన్నా పక్కన పెట్టారు!

పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి అన్ని దేశాలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తమ టీ20 వరల్డ్ కప్ టీమ్స్ ని ప్రకటించాయి. నిన్న న్యూజిల్యాండ్ జట్టు చిన్నారులతో తమ జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సౌత్ ఆఫ్రికా టీమ్ కూడా తమ జట్టును ప్రకటించింది. ఇప్పుడు టీమిండియాని కూడా బీసీసీఐ ప్రకటించి అందరినీ సంతోష పెట్టింది. దాదాపుగా అందరూ అనుకున్న ఆటగాళ్లే ఉన్నారు. కానీ, తుది జట్టులో ఆ ఒక్కడు లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత బాగా ఆడుతుంటే ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ 2024కు భారత జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్లు, నలుగురు స్టాండ్ పై ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. జట్టుని చూస్తే.. రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జాస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. స్టాండ్ బై ప్లేయర్స్: గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ లను ఎంపిక చేశారు. ఈ జట్టు చూసిన తర్వాత చాలావరకు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా కుల్దీప్, చాహల్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను చూసి ఆనంద పడుతున్నారు. కానీ, ఒక్కడి కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఒక్కడు మరెవరో కాదు.. రుతురాజ్ గైక్వాడ్. అవును రుతురాజ్ గైక్వాడ్ కి వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కలేదని అతని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. టీమిండియా అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించ గల సత్తా గైక్వాడ్ కి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే చెపాక్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లోనే ఏకంగా 98 పరుగులు చేశాడు. మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఆ ఒక్క మ్యాచ్ లోనే కాకుండా.. లక్నోపై 108 పరుగులు చేశాడు. అలాగే 50+ స్కోర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సీజన్లో ఎంతో ప్రామిసింగ్ గా కనిపించాడు.

అలాగే ఒక కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుడి నడిపిస్తున్నాడు. ప్రెజర్లో కూడా నిలకడగా ఆడగలుగుతున్నాడు. కానీ, రుతురాజ్ గైక్వాడ్ ని లైట్ తీసుకోవడంతో అంతా అప్ సెట్ అవుతున్నారు. సత్తా ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే కాకుండా.. ప్రస్తుతం సీజన్లో సంచలనాలు సృష్టిస్తున్న తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, రియాన్ పరాగ్ ను కూడా పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడంపై కూడా నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. మరి.. టీ20 వరల్డ్ తుది జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.