iDreamPost
android-app
ios-app

శ్రీలంక టూర్ కి జట్లను ప్రకటించిన BCCI.. గిల్ కి మాత్రం షాకిచ్చారు!

BCCI Announced ODI- T20 Squads For Sri Lanka Tour 2024: టీమిండియా శ్రీలంక టూర్ కి వెళ్లబోతున్న విషయం తెలిసిందే. ఈ టూర్ కి సంబంధించి టీ20 సిరీస్, వన్డే సిరీస్ కి సంబంధించి జట్లను ప్రకటించింది. గిల్ కి మాత్రం గట్టిగానే షాక్ తగిలింది.

BCCI Announced ODI- T20 Squads For Sri Lanka Tour 2024: టీమిండియా శ్రీలంక టూర్ కి వెళ్లబోతున్న విషయం తెలిసిందే. ఈ టూర్ కి సంబంధించి టీ20 సిరీస్, వన్డే సిరీస్ కి సంబంధించి జట్లను ప్రకటించింది. గిల్ కి మాత్రం గట్టిగానే షాక్ తగిలింది.

శ్రీలంక టూర్ కి జట్లను ప్రకటించిన BCCI.. గిల్ కి మాత్రం షాకిచ్చారు!

ఇప్పటివరకు అంతా టీ20 వరల్డ్ కప్ ఆఫ్టర్ సెలబ్రేషన్స్ మేనియాలోనే ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అంతా మళ్లీ క్రికెట్ మూడ్ లోకి వచ్చేశారు. శ్రీలంక టూర్ కి టీమిండియా వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టూర్ కి సంబంధించి మొదటి నుంచి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే.. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వెళ్తున్న ఫస్ట్ టూర్ ఇది. అంతేకాకుండా.. టీ20కి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న కూడా ఇప్పటి వరకు అందరి మనసును తొలిచేసింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. టీ20కి హార్దిక్ పాండ్యా మాత్రం కెప్టెన్ కాదు. అలాగే వైస్ కెప్టెన్ గా కూడా ఇంకో యంగ్ స్టర్ పేరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

గంభీర్ రావడంతోనే తన వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టేశాడు. సుధీర్ఘమైన ఆలోచనతోనే తన వ్యూహాలను అమలు చేయబోతున్నాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ టూర్ కి టీమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. ఎందుకంటే అంతా రోహిత్ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనే అనుకున్నారు. కానీ, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాబోతున్నాడు అని పుకార్లు స్టార్ట్ అయ్యాయి. అయితే అవి పుకార్లు కాదు అని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే టీ20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ చేశారు. టీ20 స్క్వాడ్ లో హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా కెప్టెన్సీ మాత్రం స్కైకి ఇచ్చారు. అది వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే ట్రైయినింగ్ అని చెప్తున్నారు. అంతేకాకుండా.. గిల్ కి గట్టిగానే షాకిచ్చారు. వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ని ఎంపిక చేశారు. గిల్ కెప్టెన్ అవుతాడు అంతా అనుకున్నారు. కానీ, గిల్ ని మాత్రం వైస్ కెప్టెన్ కి మాత్రమే పరిమితం చేశారు.

ఇంక వన్డేలకు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ పేరును ఎంపిక చేశారు. కోహ్లీ ఈ వన్డే సిరీస్ లో కొనసాగుతున్నాడు. అలాగే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్స్ గా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ అటాక్ లోకి వచ్చాడు. ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. ఇంక టీ20ల్లోకి సంజు శాంసన్ వచ్చేశాడు. రింకు సింగ్, రవి భిష్ణోయ్ లకు కూడా అవకాశం దక్కింది. ఈ టూర్ టీ20 సిరీస్ తో ప్రారంభం కానుంది. జులై 27న పల్లేకేలే వేదికగా టీ20 సిరీస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొలంబో వేదికగా వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.

వన్డే సిరీస్ స్క్వాడ్:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కీపర్), రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ ధూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

టీ20 సిరీస్ స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వేస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (కీపర్), సంజూ శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ ధూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి భిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి