IND vs ENG: ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్! షడ్యూల్‌ ప్రకటించిన BCCI

BCCI, IND vs ENG 5Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడబోయే ఓ ప్రతిష్టాత్మక టెస్ట్‌ సిరీస్‌ కోసం బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మరి మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..

BCCI, IND vs ENG 5Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడబోయే ఓ ప్రతిష్టాత్మక టెస్ట్‌ సిరీస్‌ కోసం బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మరి మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌ల తర్వాత.. భారత జట్టుకు చాలా లాంగ్‌ గ్యాప్‌ వచ్చింది. వచ్చే నెల 19వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత పలు దేశాలతో సిరీస్‌లు ఉన్నాయి. అయితే.. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా.. ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది భారత జట్టు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ 5 టెస్టుల సిరీస్‌ షడ్యూల్‌

  • 1వ టెస్ట్: 20-24 జూన్, 2025 – హెడ్లింగ్లీ, లీడ్స్
  • 2వ టెస్ట్: 2-6 జూలై, 2025 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
  • 3వ టెస్ట్: 10-14 జూలై, 2025 – లార్డ్స్, లండన్
  • 4వ టెస్ట్: 23-27 జూలై, 2025 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
  • 5వ టెస్ట్: 31 జూలై-4 ఆగస్టు, 2025 – ది ఓవల్, లండన్

ఈ సిరీస్‌కి ముందు భారత జట్టు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడనుంది భారత జట్టు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీతో పాటు.. అదే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కూడా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో కూడా ఐదు టెస్టుల ఓ గ్రాండ్‌ సిరీస్‌కు గట్టి ప్లాన్‌ చేసింది. మరి ఈ టెస్ట్‌ సిరీస్‌ షడ్యూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments