iDreamPost
android-app
ios-app

BCCI కీలక నిర్ణయం! ఆ టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కి గ్రీన్ సిగ్నల్..

  • Author Soma Sekhar Published - 03:57 PM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Published - 03:57 PM, Sat - 8 July 23
BCCI కీలక నిర్ణయం! ఆ టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కి గ్రీన్ సిగ్నల్..

సాధారణంగా క్రికెట్ లో ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వస్తూనే ఉంటాయి. ఆయా దేశాల బోర్డులు వారికి అనుగుణంగా ఈ నిబంధనలను తీసుకొస్తూ ఉంటాయి. తాజాగా బీసీసీఐ కూడా భారత క్రికెట్ లో ఓ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇటీవలే ముంబైలో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. అందులో భాగంగానే ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఆ టోర్నీలోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ముంబైలో నిర్వహించిన సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండు నిర్ణయాల్లో ఒకటి 2023 ఆసియా క్రీడల కోసం మహిళల జట్టుతో పాటుగా పురుషుల జట్టును ఆమెదించింది. దాంతో టీమిండియా-బీ జట్టు 2023 ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. మహిళల ప్రధాన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనబోతోంది. ఇక రెండో కీలక నిర్ణయం ఏంటంటే? ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉపయోగించేందుకు ఈ సమావేశంలో బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 16న ప్రారంభం అయ్యే ఈ టోర్నీలో ఇంపాక్ట్ రూల్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇంతకు ముందే ఈ రూల్ ను ఈ టోర్నీలో ప్రవేశపెట్టారు. కానీ 14వ ఓవర్ కు ముందుగానీ లేదా ఆ తరువాత గానీ ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకురావాల్సి వచ్చేది. అలాగే టాస్ కు ముందు వారి పేరును కూడా ప్రకటించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఇలా లేదు. ఐపీఎల్ లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. ఆ రూల్స్ ఇక్కడా వర్తిస్తాయి. టాస్ కు ముందు ప్లేయింగ్ లెవెన్ తో పాటుగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారో ఆ నలుగురు ఆటగాళ్ల పేర్లు కూడా ప్రకటించాల్సి ఉంటది. ఈ నలుగురి ఆటగాళ్లలో ఒక్కరిని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే వీలుంటుంది. మరి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్ మాదిరిగానే ఎన్ని మ్యాచ్ లను ఛేంజ్ చేస్తుందో వేచి చూడాలి.