iDreamPost
android-app
ios-app

World Cup 2023: పాక్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో అరుదైన సంఘటన!

  • Published Oct 06, 2023 | 6:22 PM Updated Updated Oct 06, 2023 | 6:22 PM
  • Published Oct 06, 2023 | 6:22 PMUpdated Oct 06, 2023 | 6:22 PM
World Cup 2023: పాక్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో అరుదైన సంఘటన!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్‌-నెదర్లాండ్స్‌ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ఓ గొప్ప క్రికెటర్‌ కుమారుడు ఈ వరల్డ్‌ కప్‌లో ఆడుతూ.. అచ్చం అతని తండ్రీలా సెలబ్రేషన్స్‌ చేసుకోవడం విశేషంగా మారింది. నెదర్లాండ్స్‌కు చెందిన బస్‌ డీ లీడే బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. నెదర్లాండ్స్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌. ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్‌ తీసిన అతను అచ్చం తన తండ్రీలా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీంతో అతని సెలబ్రేషన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ బస్‌ తండ్రి ఎవరని అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బస్‌ డీ లీడే తండ్రి పేరు టిమ్‌ డీ లీడే. ఇతను నెదర్లాండ్స​ మాజీ కెప్టెన్‌. నెదర్లాండ్స్‌ క్రికెట్‌ చరిత్రలో గొప్ప క్రికెటర్‌గా కీర్తి గడించాడు. హాలండ్‌లో జన్మించిన టిమ్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్, అతను సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అతనికి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. అతని బౌలింగ్ చాలా ప్రత్యేకంగా ఉండేది. ముఖ్యంగా 2003 ప్రపంచ కప్‌లో భాగంగా.. ఇండియా-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డీ లీడేకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్దు దక్కంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. టిమ్‌ 4 వికెట్లతో సత్తా చాటడంతో అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ను టిమ్‌ అవుట్‌ చేయడం విశేషం.

తన కెరీర్‌లో మొత్తం 29 వన్డేలు ఆడిన టిమ్‌ 400 రన్స్‌ చేశాడు. అలాగే 29 వికెట్లు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నెదర్లాండ్స్‌ క్రికెట్‌లో లెజెండరీ క్రికెట్‌ అయిన టిమ్‌ కుమారుడు బస్‌ డీ లీడే సైతం క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్నాడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బస్‌ డీ లీడే సైతం 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన బస్‌ 62 పరుగులిచ్చి 4 వికెట్ల పడగొట్టాడు. అయితే.. మొహమ్మద్‌ రిజ్వాన్‌ను అవుట్‌ చేసిన తర్వాత బాల్‌ను ముద్దాడుతూ బస్‌ చేసి సెలబ్రేషన్‌.. గతంలో అతని తండ్రి కూడా సచిన్‌ వికెట్‌ తీసినప్పుడు చేశాడు. దీంతో.. ఆ రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి బస్‌-టిమ్‌ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..