iDreamPost

BAN vs NZ: వన్డే క్రికెట్ లో సంచలనం.. బంగ్లా చేతిలో కివీస్ దారుణ ఓటమి!

వన్డే క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో దారుణంగా ఓడిపోయింది న్యూజిలాండ్ టీమ్.

వన్డే క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో దారుణంగా ఓడిపోయింది న్యూజిలాండ్ టీమ్.

BAN vs NZ: వన్డే క్రికెట్ లో సంచలనం.. బంగ్లా చేతిలో కివీస్ దారుణ ఓటమి!

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో సంచలనాలు నమోదు అవుతూ ఉంటాయి. ఇక ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో నమోదు అయినన్ని సంచలనాలు మరే ఇతర వరల్డ్ కప్ ల్లో కాలేదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా పసికూనలు చెలరేగి మేటి జట్లను మట్టికరిపించాయి. దీంతో త్వరగానే ఈ మెగాటోర్నీలో ఇంటిదారి పట్టాయి పటిష్ట జట్లు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో బంగ్లా బెబ్బులులు ఘన విజయం సాధించాయి. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వన్డే క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది న్యూజిలాండ్ టీమ్. అయితే ఈ సిరీస్ ను కివీస్ 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ.. చివరి పోరులో చిత్తుగా ఓడి అప్రతిష్టపాలైంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏ జట్టునైనా వారి సొంత గడ్డపై ఓడించడం అంటే పెను సవాలే నంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిరీస్ చేజారినప్పటికీ.. బంగ్లా ప్లేయర్లు చివరి మ్యాచ్ లో చెలరేగిన విధానం అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

sensational in one day cricket

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు బంగ్లా బౌలర్ల ధాటికి 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ ఒక్కడే 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సౌమ్య సర్కార్ తలా మూడు వికెట్లు తీసి రాణించారు. అనంతరం 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ 15.1 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో గత మ్యాచ్ సెంచరీ హీరో సౌమ్య సర్కార్(4) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. నజ్ముల్ హుస్సెన్(51*), అనములు హాక్(37) పరుగులతో రాణించారు. మరి ఈ సంచలన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి