Nidhan
బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మరో వివాదం నెలకొంది. ఈసారి డీఆర్ఎస్ దీనికి కారణమైంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మరో వివాదం నెలకొంది. ఈసారి డీఆర్ఎస్ దీనికి కారణమైంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
క్రికెట్లో కొన్ని జట్ల మధ్య మ్యాచులు అంటే అందరూ తప్పకుండా చూస్తారు. అలాంటి రైవల్రీస్లో బంగ్లాదేశ్-శ్రీలంక కూడా ఒకటి. ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అయితే గెలుపోటముల కంటే కూడా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌లో టీజింగ్ హైలైట్‌గా నిలుస్తూ వస్తోంది. మ్యాచ్ నెగ్గితే స్నేక్ డ్యాన్స్ చేస్తూ లంకేయులను బంగ్లా ప్లేయర్లు రెచ్చగొట్టడం.. దానికి ప్రతీకారంగా లంక టీమ్ ఒక మ్యాచ్ గెలిచాక కూడా అదే డ్యాన్స్‌తో వాళ్లను టీజ్ చేయడం తెలిసిందే. ఏళ్లుగా ఈ రెండు టీమ్స్ మధ్య ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగడం చూస్తున్నాం. గతేడాది వరల్డ్ కప్‌లోనైతే ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడంతో బంగ్లా-లంక మధ్య రైవల్రీ మరింత పెరిగింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో డీఆర్ఎస్ నిర్ణయంతో ఈ రెండు టీమ్స్ మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. బంగ్లా-లంక మధ్య బుధవారం జరిగిన రెండో టీ20లో ఓ ఔట్ వివాదాస్పదంగా మారింది.
సెకండ్ టీ20లో బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ సౌమ్య సర్కార్‌ను నాటౌట్‌గా ప్రకటించడం కాంట్రవర్సీగా మారింది. అతడు 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు బినురా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. బంతి అతడి బ్యాట్‌ను ఎడ్జ్ తీసుకుంది. బ్యాట్ ఎడ్జ్‌కు బాల్ తాకిన సౌండ్ రావడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో బంగ్లాదేశ్ డీఆర్ఎస్ తీసుకుంది. రివ్యూలో బాల్ క్లియర్‌గా బ్యాట్ ఎడ్జ్ తీసుకుందని తేలింది. అయినా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఎడ్జ్ కనిపించినా గానీ బ్యాట్‌కు బాల్‌కు మధ్య కాస్త గ్యాప్ కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో లంక ప్లేయర్లు షాకయ్యారు. అది నాటౌట్ ఏంది సామి అంటూ ఆశ్చర్యపోయారు. ఔట్ ఇవ్వాలంటూ.. ఇదేం డెసిషన్ అంటూ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. ఆ షాట్ కొట్టిన సౌమ్య సర్కార్‌తోనూ కొందరు లంక ప్లేయర్లు సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించారు.
లంక ఆటగాళ్లతో సౌమ్య సర్కార్ సీరియస్‌గా మాట్లాడుతుండగా మరో ఓపెనర్ లిటన్ దాస్ అతడ్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడని.. సైలెంట్‌గా ఉండమని సూచించాడు. అంపైర్లతో ఎంత వాదించినా నిర్ణయం మార్చుకోకపోవడంతో లంక ప్లేయర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ వివాదం కారణంగా కొద్ది సేపు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ అయింది. ఇక, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 రన్స్ చేసి విజయాన్ని సాధించింది. ఔట్ నుంచి తప్పించుకున్న సౌమ్య సర్కార్ 26 పరుగులు చేశాడు. అతడి విషయంలో థర్డ్ అంపైర్ చేసిన దానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతడ్ని తప్పు పడుతుంటే, మరికొందరు సమర్థిస్తున్నారు. మరి.. సౌమ్య సర్కార్ నాటౌట్ విషయంలో మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: సచిన్‌ను వెనక్కి పంపిన బిగ్‌బాస్ విన్నర్.. కానీ ఉన్నంత సేపు..!
New DRS Controversy in BAN vs SL Match. pic.twitter.com/T6gLKliZ3y
— CricketGully (@thecricketgully) March 6, 2024