iDreamPost
android-app
ios-app

వీడియో: బంగ్లా-లంక మధ్య చిచ్చు పెట్టిన DRS.. అది నాటౌట్ ఏంది సామి!

  • Published Mar 07, 2024 | 9:15 AM Updated Updated Mar 07, 2024 | 9:15 AM

బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మరో వివాదం నెలకొంది. ఈసారి డీఆర్ఎస్ దీనికి కారణమైంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మరో వివాదం నెలకొంది. ఈసారి డీఆర్ఎస్ దీనికి కారణమైంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 07, 2024 | 9:15 AMUpdated Mar 07, 2024 | 9:15 AM
వీడియో: బంగ్లా-లంక మధ్య చిచ్చు పెట్టిన DRS.. అది నాటౌట్ ఏంది సామి!

క్రికెట్​లో కొన్ని జట్ల మధ్య మ్యాచులు అంటే అందరూ తప్పకుండా చూస్తారు. అలాంటి రైవల్రీస్​లో బంగ్లాదేశ్-శ్రీలంక కూడా ఒకటి. ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అయితే గెలుపోటముల కంటే కూడా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్​లో టీజింగ్ హైలైట్​గా నిలుస్తూ వస్తోంది. మ్యాచ్ నెగ్గితే స్నేక్ డ్యాన్స్ చేస్తూ లంకేయులను బంగ్లా ప్లేయర్లు రెచ్చగొట్టడం.. దానికి ప్రతీకారంగా లంక టీమ్ ఒక మ్యాచ్ గెలిచాక కూడా అదే డ్యాన్స్​తో వాళ్లను టీజ్ చేయడం తెలిసిందే. ఏళ్లుగా ఈ రెండు టీమ్స్ మధ్య ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగడం చూస్తున్నాం. గతేడాది వరల్డ్ కప్​లోనైతే ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్​ ఔట్​గా ప్రకటించడంతో బంగ్లా-లంక మధ్య రైవల్రీ మరింత పెరిగింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు తాజాగా జరిగిన టీ20 మ్యాచ్​లో డీఆర్ఎస్ నిర్ణయంతో ఈ రెండు టీమ్స్ మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. బంగ్లా-లంక మధ్య బుధవారం జరిగిన రెండో టీ20లో ఓ ఔట్ వివాదాస్పదంగా మారింది.

సెకండ్ టీ20లో బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ సౌమ్య సర్కార్​ను నాటౌట్​గా ప్రకటించడం కాంట్రవర్సీగా మారింది. అతడు 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు బినురా బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్ ఇచ్చాడు. బంతి అతడి బ్యాట్​ను ఎడ్జ్ తీసుకుంది. బ్యాట్​ ఎడ్జ్​కు బాల్ తాకిన సౌండ్ రావడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో బంగ్లాదేశ్ డీఆర్ఎస్ తీసుకుంది. రివ్యూలో బాల్ క్లియర్​గా బ్యాట్ ఎడ్జ్ తీసుకుందని తేలింది. అయినా థర్డ్ అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. ఎడ్జ్‌ కనిపించినా గానీ బ్యాట్​కు బాల్​కు మధ్య కాస్త గ్యాప్ కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. దీంతో లంక ప్లేయర్లు షాకయ్యారు. అది నాటౌట్ ఏంది సామి అంటూ ఆశ్చర్యపోయారు. ఔట్ ఇవ్వాలంటూ.. ఇదేం డెసిషన్ అంటూ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. ఆ షాట్ కొట్టిన సౌమ్య సర్కార్​తోనూ కొందరు లంక ప్లేయర్లు సీరియస్​గా మాట్లాడుతూ కనిపించారు.

లంక ఆటగాళ్లతో సౌమ్య సర్కార్​ సీరియస్​గా మాట్లాడుతుండగా మరో ఓపెనర్ లిటన్ దాస్ అతడ్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాడు. అంపైర్ నాటౌట్​ ఇచ్చాడని.. సైలెంట్​గా ఉండమని సూచించాడు. అంపైర్లతో ఎంత వాదించినా నిర్ణయం మార్చుకోకపోవడంతో లంక ప్లేయర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ వివాదం కారణంగా కొద్ది సేపు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ అయింది. ఇక, ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన బంగ్లా 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 రన్స్ చేసి విజయాన్ని సాధించింది. ఔట్ నుంచి తప్పించుకున్న సౌమ్య సర్కార్ 26 పరుగులు చేశాడు. అతడి విషయంలో థర్డ్ అంపైర్ చేసిన దానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతడ్ని తప్పు పడుతుంటే, మరికొందరు సమర్థిస్తున్నారు. మరి.. సౌమ్య సర్కార్ నాటౌట్ విషయంలో మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: సచిన్​ను వెనక్కి పంపిన బిగ్​బాస్ విన్నర్.. కానీ ఉన్నంత సేపు..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom