Mushfiqur Rahim in BAN vs NZ Test Match: టైమ్డ్ ఔట్ కాంట్రవర్సీ ముగిసిందో లేదో క్రికెట్లో మరో వివాదస్పద ఔట్ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ చేతులారా ఔట్ అయ్యాడు.
Mushfiqur Rahim in BAN vs NZ Test Match: టైమ్డ్ ఔట్ కాంట్రవర్సీ ముగిసిందో లేదో క్రికెట్లో మరో వివాదస్పద ఔట్ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ చేతులారా ఔట్ అయ్యాడు.
క్రికెట్ హిస్టరీలో అప్పుడప్పుడూ అరుదైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటనే ఇటీవల వరల్డ్ కప్‌లో చోటుచేసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య రీతిలో టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. హెల్మెట్ ప్రాబ్లమ్ వల్ల నిర్ణీత టైమ్‌లోగా మాథ్యూస్ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ స్టార్ట్ చేయలేకపోయాడు. దీంతో అపోజిషన్ బంగ్లాదేశ్ టీమ్ అతడ్ని ఔట్‌గా ఇవ్వాలంటూ అప్పీల్ చేసింది. అసలేం జరుగుతుందో అర్థం కాని మాథ్యూస్ అంపైర్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. తాను కావాలని ఇలా చేయలేదని హెల్మెట్ స్ట్రిప్ ఊడటంతో ఆలస్యమైందని వివరణ ఇచ్చాడు. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు మాథ్యూస్. కానీ షకీబ్ తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో అతడ్ని టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు.
అప్పటివరకు క్రికెట్లో క్లీన్ బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్, రనౌట్, స్టంపౌట్ రూపంలో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరడం చూసిన ఫ్యాన్స్.. ఇలా టైమ్డ్ ఔట్ చూసేసరికి షాకయ్యారు. బ్యాటర్‌ను ఇలా కూడా ఔట్ చేయొచ్చా అని ఆశ్చర్యపోయారు. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ కాంట్రవర్సీ కారణంగా మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్-శ్రీలంక ఆటగాళ్లు ఒకర్నొకరు విష్ చేసుకోకుండానే గ్రౌండ్లో నుంచి వెళ్లిపోయారు. మ్యాచ్ అనంతరం మాథ్యూస్ మాట్లాడుతూ షకీబ్‌ను, బంగ్లా టీమ్‌ను విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి టీమ్‌ను తానెప్పుడూ చూడలేదని.. ఇలాగేనా వ్యవహరించేది? అంటూ లంక ఆల్‌రౌండర్ సీరియస్ అయ్యాడు.
టైమ్డ్ ఔట్ వివాదం ముగిసిందో లేదో క్రికెట్లో మరో కాంట్రర్షియల్ ఔట్ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫికర్ రహీం (35) అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. జెమీసన్ వేసిన బాల్‌ను డిఫెన్స్ చేశాడు ముష్ఫికర్. ఆ బాల్ కింద పడి వికెట్లకు కాస్త దూరంలో పోతోంది. అయితే అది ఎక్కడ వికెట్ల మీదకు వస్తుందోనని దాన్ని చేతితో అడ్డుకున్నాడు ముష్ఫికర్. దీంతో కివీస్ టీమ్ అతడు ఔట్ అంటూ అప్పీల్ చేసింది. దీనిపై అంపైర్లు థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరారు. ముష్ఫికర్ ఉద్దేశపూర్వకంగానే బంతిని ఆపినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. బంగ్లాదేశ్ చరిత్రలో ఒక బ్యాటర్ ఇలా అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా ఔట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. అయితే ముష్ఫికర్ ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు కావాలనే ఇలా ఔట్ అయ్యాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. బాల్ ఎక్కడో బయటకు పోతుంటే దాన్ని చేతితో ఆపాల్సిన పనేంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ముష్ఫికర్ ఔట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రపంచంలో ఏ బ్యాటర్‌కూ భయపడలేదు! అతనొక్కడికే భయపడ్డా: డేల్ స్టెయిన్!
Oops! Don’t do that… 😲
Mushfiqur Rahim became the first Bangladesh batter to be dismissed handling the ball. #BANvNZ pic.twitter.com/Jlj9gxiZiK
— Cricket.com (@weRcricket) December 6, 2023