SNP
SNP
క్రికెట్‌లో మన్కండింగ్ ఎంత వివాదాస్పదమైందో అందరికి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో బట్లర్‌ను మన్కండింగ్ ద్వారా అవుట్ చేశాడు. అలాగే ఉమెన్స్ క్రికెట్‌లో దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్‌ను మన్కండింగ్‌తో అవుట్ చేసింది. రెండు సందర్భాల్లోనే ఈ విధమైన అవుట్‌పై చాలా చర్చ జరిగింది. ఇది రూల్ అని కొంతమంది, కాదు.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మరికొంతమంది వాదనకు దిగారు. మొత్తానికి మన్కండింగ్‌ను ఐసీసీ లీగల్ చేసింది. దాన్ని మన్కండింగ్‌గా కాకుండా.. రనౌట్‌గా గుర్తించాలని స్పష్టం చేసింది. అయినా కూడా కొంతమందిలో ఇది సరైన పద్ధతి కాదనే భావన ఉంది.
అయితే.. తాజాగా ఇలాంటి రనౌట్ బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46వ మన్కండింగ్ రనౌట్ జరిగింది. చివరి ఓవర్లు కావడంతో న్యూజిలాండ్ బ్యాటర్ సోధీ స్ట్రైక్ కోసం ముందుకు వెళ్లిపోయాడు.. ఇది గమనించిన బంగ్లాదేశ్ బౌలర్.. హసన్ మహముద్ బాల్ రిలీజ్ చేయకుండా వికెట్లను గిరాటేశాడు. రనౌట్ కోసం అపీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. దాన్ని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బౌలర్ యాక్షన్ కంప్లీట్ కాకముందే.. బ్యాటర్ క్రీజ్ వదిలి ముందుకు వెళ్లినట్లు గుర్తించి.. సోధీని అవుట్‌గా ప్రకటించాడు.
దీంతో.. 17 పరుగులు చేసిన ఇస్ సోధీ పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. ఈ మన్కండింగ్‌పై.. బంగ్లాదేశ్ కెప్టెన్, వికెట్ కీపర్ లింటన్ దాస్.. హసన్ మహముద్‌తో మాట్లాడి.. తన అపీల్‌ను వెనక్కి తీసుకోమని కోరాడు. దానికి హసన్ అంగీకరించడంతో.. సోధీని తిరిగి బ్యాటింగ్‌కు పిలిపించారు. తిరిగి క్రీజ్‌లోకి వచ్చిన సోధీ.. బంగ్లాదేశ్ బౌలర్ హసన్‌ను కౌగిలించుకుని.. తన కృతజ్ఞతను తెలిపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన పనిపై ప్రశంసలు వస్తున్నాయి. చివరి ఓవర్లలో బ్యాటర్ భారీగా పరుగులు చేస్తాడని తెలిసి.. రూల్స్ ప్రకారం అవుటైనా కూడా బ్యాటర్‌ను తిరిగి బ్యాటింగ్‌కు పిలువడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ish Sodhi fell victim to a Mankad by Hasan Mahmud, but in a display of sportsmanship, Litton Das called him back.#IshSodhi #Cricket #HasanMahmud #LittonDas #BANvsNZ #Mankad #Mankading #SpiritoftheGame pic.twitter.com/l3RsFbYBzm
— SkyExch (@officialskyexch) September 23, 2023
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో అదరగొట్టేది బాబర్ అజమ్! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్