T20 World Cup 2024: నిద్ర మత్తులో వరల్డ్ కప్ మ్యాచ్ మిస్ అయిన స్టార్ క్రికెటర్! ఆలస్యంగా వెలుగులోకి..

నిద్రమత్తు కారణంగా టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన కీలక మ్యాచ్ కు దూరమైయ్యాడు ఓ స్టార్ క్రికెటర్. పైగా అతడు ఆ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు..

నిద్రమత్తు కారణంగా టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన కీలక మ్యాచ్ కు దూరమైయ్యాడు ఓ స్టార్ క్రికెటర్. పైగా అతడు ఆ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు..

ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఎన్నో కలలు కంటూ ఉంటాడు. ఇక దాని కోసం ఎంతో కష్టపడుతూ.. తన జీవితాన్ని మెుత్తం ధారపోస్తాడు. అన్నీ చేసినా గానీ.. కొందరికి అదృష్టం కలిసిరాక వరల్డ్ కప్ టీమ్ లో చోటును దక్కించుకోలేరు. ఇక మరికొందరికి తమ ఫామ్ ఆధారంగా టీమ్ లో ప్లేస్ కన్ఫామ్ అవుతుంది. అయితే ఓ స్టార్ ప్లేయర్ నిద్రమత్తులో ఉండి ఏకంగా వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్ నే మిస్ చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ టీమిండియాతో తలపడింది. ఈ కీలక మ్యాచ్ లో కేవలం ఇద్దరు పేసర్లతోనే బంగ్లా బరిలోకి దిగింది. తుది జట్టులో వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీమిండియాతో జరిగిన కీలకమైన మ్యాచ్ కు అతడు ఎందుకు దూరమైయ్యాడు? అన్న ప్రశ్న అప్పుడు వైరల్ గా మారింది. అతడిపై వేటు వేశారని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం తాజాగా బయటపడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించాడు.

“నిద్రమత్తులో ఉన్న తస్కిన్ అహ్మద్ సమయానికి ఫోన్ ఎత్తలేదు. దాంతో బస్ మిస్ అయ్యింది, జట్టులో చేరలేకపోయాడు. అయితే ఈ విషయంపై తను అందరికి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత టీమ్ లో చేరాడు. అయినప్పటికీ.. అతడిని ఎందుకు ఆడించలేదో హెడ్ కోచ్ కే తెలియాలి. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఉంటే.. తర్వాత మ్యాచ్ లో అతడు ఎందుకు ఆడతాడు?” అని బీసీబీ అధికారి చెప్పుకొచ్చాడు. మరి నిద్రమత్తు కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ నే మిస్ చేసుకున్న బంగ్లా ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments