బంగ్లాదేశ్ చేతిలో మరోమారు పాకిస్థాన్ చిత్తు.. సొంతగడ్డపై వైట్​వాష్!

Bangladesh Humiliate Pakistan: బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్​ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది.

Bangladesh Humiliate Pakistan: బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్​ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది.

బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్​ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది. రెండో టెస్టులో పాకిస్థాన్​ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది బంగ్లాదేశ్. ఆ టీమ్ విసిరిన 185 పరుగుల టార్గెట్​ను 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. వరుసగా రెండో టెస్టులో విజయం సాధించిన బంగ్లా.. ఈ సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఓడి తీవ్రంగా విమర్శలపాలైన ఆతిథ్య జట్టు.. ఇప్పుడు వైట్​వాష్​ అవడంతో మరిన్ని ట్రోల్స్​ను ఎదుర్కోక తప్పదు. ఇక, సెకండ్ టెస్ట్​లో బంగ్లాకు ఛేజింగ్​ అంత ఈజీ కాలేదు. ఒక దశలో 127 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిందా టీమ్.

పాక్ బౌలర్లు మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్​లు బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే ఛేదించాల్సిన స్కోరు పెద్దగా లేకపోవడం, చేతిలో వికెట్లు ఉండటం, మంచి బ్యాటర్లు అందుబాటులో ఉండటంతో ఆ టీమ్ టెన్షన్ పడలేదు. ఓపెనర్ జాకీర్ హసన్ (40)తో పాటు నజ్ముల్ హొస్సేన్ షంటో (38) రాణించారు. 127/3తో ఉన్న టైమ్​లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని పాక్ ఆశించింది. కానీ బంగ్లా సీనియర్ ప్లేయర్లు ముష్ఫికుర్ రహీమ్ (22 నాటౌట్), షకీబ్ అల్ హసన్ (21 నాటౌట్) వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరూ ఒక్కో రన్ తీస్తూ నిదానంగా టీమ్​ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో బంగ్లా ప్లేయర్లు సంబురాల్లో మునిగిపోగా.. మరో అవమానకర ఓటమి ఎదురవడంతో పాక్ ప్లేయర్లు నిరాశలో కూరుకుపోయారు.

గత కొన్నేళ్లుగా చెత్తాటతో పరువు తీసుకుంటున్న పాకిస్థాన్​కు బంగ్లాదేశ్ చేతుల్లో వైట్​వాష్ బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆ టీమ్ సొంతగడ్డపై గెలుపు రుచి చూసి 1,303 రోజులు అవుతోంది. గత రెండున్నరేళ్ల కాలంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్​ చేతుల్లో టెస్ట్ సిరీస్​లో ఓటమి పాలైంది. ఇంగ్లండ్​ మీద టీ20 సిరీస్, న్యూజిలాండ్ చేతుల్లో వన్డే సిరీస్​ను కోల్పోయింది. అలాగే వన్డే వరల్డ్ కప్​లో ఆఫ్ఘానిస్థాన్​ చేతుల్లో ఓడిపోయింది. టీ20 ప్రపంచ కప్​లో పసికూన యూఎస్​ఏ చేతుల్లో మట్టికరిచింది. ఒకప్పుడు దూకుడైన ఆటతీరుతో అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టిన పాక్.. ఇప్పుడు సొంతగడ్డపై బంగ్లా చేతుల్లో వైట్​వాష్ అయింది. దీన్ని బట్టే ఆ టీమ్ ఆటతీరు పాతాళానికి పడిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ నుంచి ఆ జట్టు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో చూడాలి.

Show comments