iDreamPost
android-app
ios-app

పాక్ ని వణికించిన బంగ్లా స్టార్ ప్లేయర్స్! రోహిత్, కోహ్లీ కన్నా నయం!

  • Author Soma Sekhar Published - 06:44 PM, Wed - 6 September 23
  • Author Soma Sekhar Published - 06:44 PM, Wed - 6 September 23
పాక్ ని వణికించిన బంగ్లా స్టార్ ప్లేయర్స్! రోహిత్, కోహ్లీ కన్నా నయం!

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. సూపర్ 4 దశలో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లా టీమ్. అయితే బ్యాటింగ్ కు దిగిన బంగ్లా టీమ్ కు చుక్కలు చూపించారు పాక్ పేసర్లు. నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. బంగ్లా టాపార్డర్ ను కాకావికలం చేశారు. కేవలం 9 ఓవర్లలోనే 47 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్(53), వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. తమ అనుభవంతో.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ ను పటిష్ట స్థితిలో నిలిపారు. వీరి బ్యాటింగ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షకీబ్, ముష్పికర్ బ్యాటింగ్ రోహిత్, కోహ్లీ కన్నా నయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అనుభవం.. ఓ సమస్య నుంచి గట్టెక్కించగలదు. అనుభవం ఓ విజయానికి బాటలు వేయగలదు. ప్రస్తుతం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ అనుభవంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును పటిష్టస్థితిలో నిలిచేలా చేశారు బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్లు. ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న తొలి సూపర్ 4 మ్యాచ్ లో పాక్-బంగ్లా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పటిష్టమైన పాక్ బౌలింగ్ పేస్ దళం బంగ్లా టాపార్డర్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ క్రమంలోనే ఇద్దరు సీనియర్ బ్యాటర్లు కలిసి.. జట్టును పటిష్టస్థితిలో నిలిపారు. షకీబ్ అల్ హసన్ (53), ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో రాణించారు. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో 5వ వికెట్ కు విలువైన 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫాహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో షకీబ్ అవుట్ కావడంతో.. ఈ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా.. తమ అనుభవంతో పాక్ పేస్ దళాన్ని వణికించారు వీరిద్దరు. ఫోర్లు, సిక్సర్లు బాదనప్పటికీ.. సమయోచిత బ్యాటింగ్ తో జట్టును ముందుకు నడిపారు. దీంతో ఈ సీనియర్ బ్యాటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కన్నా మీరే నయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. ఇలాంటి పరిస్థితి గత మ్యాచ్ లో రాగా.. జట్టును ముందుండి నడిపించాల్సిన విరాట్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. దీంతో వీరిద్దరి కంపేర్ చేస్తున్నారు అభిమానులు. ఓ ఆటగాడి అనుభవం జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవసరం కావాలి. అలా కానప్పుడు ఆ ఆటగాడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా దండగే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. అయితే వీరు నెలకొల్పిన విలువైన భాగస్వామ్యాన్ని భారీ స్కోర్ గా మలచడంలో విఫలం అయ్యారు మిగతా బ్యాటర్లు. పాక్ బౌలర్ల ధాటికి 38.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్ టీమ్. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 4 వికెట్లతో చెలరేగగా.. నసీం షా 3 వికెట్లతో సత్తా చాటాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి