iDreamPost

బంగ్లా-కివీస్‌ మ్యాచ్‌లో ఓవర్‌కు 7 బంతులు వేయించిన అంపైర్‌!

  • Author Soma Sekhar Updated - 01:39 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Updated - 01:39 PM, Mon - 25 September 23
బంగ్లా-కివీస్‌ మ్యాచ్‌లో ఓవర్‌కు 7 బంతులు వేయించిన అంపైర్‌!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో అంపైర్లు చేసే తప్పిదాలకు కొన్ని కొన్ని సార్లు జట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు తప్పుల మీద తప్పులు చేస్తూ.. గల్లీ క్రికెట్ అంపైరింగ్ ను తలపిస్తున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో తప్పిదాలు చేస్తూ.. నవ్వులపాలవుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అంపైర్ చేసిన పొరపాటుతో నవ్వుల పాలైయ్యాడు. ఓవర్ లెక్క వేయడం మర్చిపోయిన అంపైర్ బౌలర్ చేత ఎన్ని బాల్స్ వేయించాడో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ అంపైరింగ్ అంటే మామూలు విషయం కాదు.. పైగా ఎన్నో మ్యాచ్ ల అనుభవం ఉంటే గానీ వారికి ఈ అవకాశం ఇవ్వరూ. కానీ ఇంత అనుభవం ఉన్నా గానీ కొన్ని కొన్ని సార్లు వారు చేసే తప్పిదాలు చూస్తే మాత్రం నవ్వురాక మానదు. ఇక మరికొన్ని తప్పిదాలు మ్యాచ్ విజేతనే మార్చేస్తాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో అంపైర్ చేసిన పొరపాటు వల్ల మ్యాచ్ స్వరూపం మారలేదు గానీ.. అతడు నవ్వులపాలైయ్యాడు. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో బౌలర్ ఎన్ని బంతులు వేశాడో లెక్క వేయడం మర్చిపోయాడు అంపైర్ షర్ఫుద్దోలా.

ఈ మ్యాచ్ లో బ్రెయిన్ ఫేడ్ ఎదుర్కొన్న అతడు బౌలర్ వేస్తున్న బాల్స్ ను లెక్కబెట్టడం మర్చిపోయాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న 47వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ ఈ ఓవర్ వేయడానికి రాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ పెర్గూసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్లో బౌలర్ వేసిన బాల్స్ ను లెక్కించడం మర్చిపోయాడు షర్పుద్దోలా. దీంతో ఈ ఓవర్ లో ఆరు బంతులకు బదులుగా ఏడు బాల్స్ వేయించాడు. అయితే ఈ ఎక్స్ ట్రా బంతి వల్ల రెండు జట్లకు ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? షర్ఫుద్దోలా బంగ్లా మాజీ క్రికెటర్ కావడమే. అతడికి 150 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అంపైర్ గా వ్యవహరించిన అనుభవం కూడా ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 49.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాను ఇష్ సోథీ నడ్డి విరిచాడు. 6 వికెట్లతో చెలరేగడంతో.. బంగ్లా 168 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 86 తేడాతో కివీస్ విజయం సాధించింది. మరి పొరపాటు చేసి.. నవ్వుల పాలైన అంపైర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి