iDreamPost
android-app
ios-app

Ashes 2023: ఆ రూల్ ఒక్క భారత్​కేనా? ఆస్ట్రేలియాకు వర్తించదా?: గంభీర్

  • Author singhj Published - 02:44 PM, Mon - 3 July 23
  • Author singhj Published - 02:44 PM, Mon - 3 July 23
Ashes 2023: ఆ రూల్ ఒక్క భారత్​కేనా? ఆస్ట్రేలియాకు వర్తించదా?: గంభీర్

యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా జట్టు చెలరేగుతోంది. బజ్​బాల్ వ్యూహంతో ఆడుతున్న ఇంగ్లండ్​కు ఆ టీమ్ చెమటలు పట్టిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫస్ట్ టెస్టులో విక్టరీ కొట్టిన కమిన్స్ సేన.. రెండో మ్యాచులోనూ ఇంగ్లీష్ టీమ్​ను ఓడించింది. దీంతో ఐదు టెస్టుల ఈ యాషెస్ సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆసీస్. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ సత్తా చాటిన కంగారూ టీమ్.. కీలక మ్యాచ్​లో గెలుపుతో సిరీస్​లో లీడింగ్​లోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్​లో ఆసీస్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. క్రికెట్ పరువును ఆ జట్టు మంటగలిపిందని అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు.

టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా ఆస్ట్రేలియా జట్టు బిహేవియర్​పై తీవ్రంగా స్పందించాడు. ‘హే స్లెడ్జర్స్.. స్పోర్ట్స్ స్పిరిట్ మీకు వర్తించదా..? కేవలం ఇండియన్స్​కేనా?’ అంటూ ట్విట్టర్​లో గౌతీ ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆఖరి రోజు ఫస్ట్ సెషన్​లో ఇంగ్లండ్ 193/5 రన్స్​తో ఉన్న టైమ్​లో.. కామెరూన్ గ్రీన్ వేసిన బౌన్సర్​ను తప్పించుకునేందుకు బెయిర్​స్టో కిందకు వంగాడు. బాల్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఓవర్ పూర్తయిందనుకున్న ఉద్దేశంతో బెయిర్​స్టో క్రీజును దాటాడు. అయితే వెంటనే కీపర్ కేరీ బాల్​ను కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. దీంతో ఆసీస్ ప్లేయర్లందరూ అప్పీల్ చేశారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల అప్పీల్ చూసి క్రీజులో ఉన్న బెయిర్ స్టో, నాన్​స్ట్రైకర్ బెన్ స్టోక్స్​తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు, స్టాండ్స్​లోని ఫ్యాన్స్ ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్​స్టో రన్ తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్​గా ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ బాల్ డెడ్ కాలేదని భావించి బెయిర్​స్టోను ఎరాస్మస్ స్టంపౌట్​గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ ప్లేయర్లు షాక్ అయ్యారు. ఆసీస్ సారథి కమిన్స్​తో స్టోక్స్, బెయిర్​స్టో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనతో స్టేడియంలోని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేస్తూ గట్టిగా కేకలు వేశారు. మోసం చేయడం కంగారూ టీమ్​కు వెన్నతో పెట్టిన విద్య అని ట్రోల్ చేశారు. మరి.. బెయిర్ స్టో విషయంలో ఆసీస్ టీమ్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.