బతికిపోయిన బంగ్లాదేశ్.. అది అడ్డుపడకపోతే మూడో రోజే కథ ముగిసేది!

Bad Light Halts Play on Day 3 Of IND vs BAN: ఇండియా టూర్​లో అదరగొడతామని, భారత్ పని పడతామంటూ ఓవరాక్షన్ చేసింది బంగ్లాదేశ్. సీన్ కట్ చేస్తే తొలి టెస్టులోనే దారుణ ఓటమిని మూటగట్టుకునేలా ఉంది.

Bad Light Halts Play on Day 3 Of IND vs BAN: ఇండియా టూర్​లో అదరగొడతామని, భారత్ పని పడతామంటూ ఓవరాక్షన్ చేసింది బంగ్లాదేశ్. సీన్ కట్ చేస్తే తొలి టెస్టులోనే దారుణ ఓటమిని మూటగట్టుకునేలా ఉంది.

భారత్-బంగ్లాదేశ్.. రెండూ మిత్రదేశాలు. ఇరు కంట్రీస్ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ క్రికెట్​లో మాత్రం ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. టీమిండియా బంగ్లాను అంత సీరియస్​గా తీసుకోదు. కానీ ఆ జట్టు మాత్రం మనతో మ్యాచ్ అంటే ఓవరాక్షన్ చేస్తుంది. ఒకవేళ గెలిస్తే ఆ టీమ్ ప్లేయర్లు చేసే అతిని తట్టుకోవడం కష్టం. అందుకే ఎప్పుడు బంగ్లా ఎదురుపడినా చిత్తుగా ఓడిస్తుంది మెన్ ఇన్ బ్లూ. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. రెండు టెస్టుల సిరీస్ కోసం ఇక్కడికి వచ్చిన షంటో సేన ఇప్పుడు ఓటమి ముంగిట నిలబడింది. పాకిస్థాన్​ను క్లీన్​స్వీప్ చేసి భారత్​ను కూడా ఓడిస్తామంటూ కొన్ని వారాల కింద బిల్డప్ ఇచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు టీమిండియా ముందు సాగిలపడుతోంది. చెన్నై టెస్ట్​లో ఆ టీమ్ ఓటమి ఖాయంగా మారింది. అయితే మూడో రోజే బంగ్లా టైగర్స్ కథ ముగియాల్సింది. కానీ అదృష్టం కొద్దీ బతికిపోయింది.

బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట నిర్దిష్ట సమయం కంటే ముందే ఆగిపోయింది. మబ్బులు కమ్మి కాస్త చీకటి రావడంతో నిర్ణీత ఓవర్ల కంటే ముందే డే-3 గేమ్​ను నిలిపివేశారు అంపైర్లు. అప్పటికే బంగ్లాదేశ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు. కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (51 నాటౌట్), ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మూడు వికెట్లు తీసి జోరు మీదున్నాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. షాద్మన్ ఇస్లాం (35), మోమినుల్ హక్ (13)తో పాటు సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం (13)ను ఔట్ చేశాడు అశ్విన్. పిచ్ స్పిన్​కు అనుకూలిస్తుండటం, అశ్విన్ జోరు మీదుండటంతో మూడో రోజు బంగ్లా మరో మూడ్నాలుగు వికెట్లు కోల్పోవడం ఖాయంగా కనిపించింది. వాతావరణం అనుకూలించి ఆట మరింత సేపు సాగితే ఆ టీమ్ ఇన్నింగ్స్ ఇంకా డేంజర్​లో పడేది.

వెలుతురు సమస్య రావడంతో బంగ్లాదేశ్ బతికిపోయింది. ఆట మరికొద్ది సేపు జరిగితే ఆ టీమ్ మిడిలార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్​కు చేరేవారు. అదే జరిగితే నాలుగో రోజు కనీసం పోరాడే అవకాశం కూడా దొరికేది కాదు. ఎందుకంటే పిచ్ నుంచి ఇంకా పేసర్లకు మద్దతు దొరుకుతోంది. అదే టైమ్​లో బాల్ గింగిరాలు తిరుగుతోంది. కాబట్టి అటు పేస్, ఇటు స్పిన్ ధాటికి బంగ్లా లోయరార్డర్ తట్టుకొని నిలబడటం కష్టం. ఆదివారం మార్నింగ్ సెషన్​లోనే ఆ టీమ్ కథ ముగిసే ఛాన్స్ ఉండేది. కానీ బ్యాడ్ లైట్ వల్ల మూడో రోజు త్వరగా ఆట నిలిచిపోవడంతో షంటో, షకీబ్ బతికిపోయారు. లిటన్ దాస్ నెక్స్ట్ బ్యాటింగ్​కు వస్తాడు. కాబట్టి నాలుగో రోజు లంచ్ వరకు పోరాడే ఛాన్స్ ఆ టీమ్​కు దొరికింది. ఎలాగూ ఓడిపోవడం ఖాయం, కానీ బ్యాడ్ లైట్ వల్ల బంగ్లాకు ఫైట్ చేసే అవకాశం దొరికింది. ఆ టీమ్ విజయానికి ఇంకా 357 పరుగుల దూరంలో ఉంది. ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉన్నా చేతిలో 6 వికెట్లే ఉన్నాయి. ప్రధాన బ్యాటర్లు ముగ్గురే ఉన్నారు. కాబట్టి బంగ్లా ఓటమి తథ్యం. అయితే టీమిండియా గెలుపును ఆ టీమ్ ఎంత ఆలస్యం చేస్తుందో చూడాలి.

Show comments