iDreamPost
android-app
ios-app

World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ముందు బాబర్‌ భారీ స్టేట్‌మెంట్‌!

  • Published Oct 13, 2023 | 7:49 PM Updated Updated Oct 13, 2023 | 7:49 PM
  • Published Oct 13, 2023 | 7:49 PMUpdated Oct 13, 2023 | 7:49 PM
World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ముందు బాబర్‌ భారీ స్టేట్‌మెంట్‌!

పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సంచలన కామెంట్లు చేశాడు. రేపు భారత్, పాక్ మధ్య పోరు జరుగనున్న వేళ బాబర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాబర్ చేసిన కామెంట్స్ కొంత అహంకార పూరిత దోరణితో ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాక్ శ్రీలంకపై విజయం సాధించింది. కానీ బాబర్ తక్కువ స్కోర్ కే వికెట్ సమర్పించుకోవడంతో విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తను ఔటైన తీరుపై స్పందించిండు బాబర్. ఇంతకీ ఏమన్నడంటే?

పాక్ కెప్టెన్ బాబర్ జట్టులో కీలకమైన ఆటగాడు. అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ తో పరుగుల వరద పారించే సత్తా ఉన్నోడు. కాగా పాక్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో బాబర్ కేవలం 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మదుశనక వేసిన ఏడో ఓవర్లో లెగ్ సైడ్ వచ్చిన బాల్ ను ఆడబోయి వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. సమర విక్రమ ఏ విధమైన తప్పిదం లేకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో తీవ్ర నిరాశతో బాబర్ మైదానాన్ని వీడాడు. అయితే దీనిపై బాబర్ తాజాగా స్పందించాడు.

తన తప్పిదం వల్లనే ఔటయ్యానని వెల్లడించాడు. నా వికెట్ తీయడంలో బౌలర్ల గొప్పదనం ఏమీ లేదని సంచలన కామెంట్స్ చేశారు. మళ్లీ అటువంటి తప్పిదం పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. కాగా రేపు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగనున్న వేల బాబర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కామెంట్లపై నెటిజన్లు బాబర్ ను ఆడేసుకుంటున్నారు. రేపు జరుగబోయే మ్యాచ్ లో అనుకున్న స్థాయిలో రాణిస్తాడా లేక బౌలర్ల ధాటకి మళ్లీ వికెట్ చేజార్చుకుంటాడో తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom