iDreamPost
android-app
ios-app

అల్లుడి కోసం అఫ్రిది పిచ్చి కామెంట్స్! పాపం బాబర్ ని బలి చేస్తూ!

Shahid Afridi- Babar Azam: బాబర్ అజామ్ ని మరోసారి పాకిస్తాన్ జట్టు టీ20 జట్టు కెప్టెన్ గా ప్రకటించారు. అయితే ఈ ఎంపికపై పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

Shahid Afridi- Babar Azam: బాబర్ అజామ్ ని మరోసారి పాకిస్తాన్ జట్టు టీ20 జట్టు కెప్టెన్ గా ప్రకటించారు. అయితే ఈ ఎంపికపై పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

అల్లుడి కోసం అఫ్రిది పిచ్చి కామెంట్స్! పాపం బాబర్ ని బలి చేస్తూ!

ఈమధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. వాటిలో దాదాపు అన్నీ పరువు పోగొట్టుకునే విషయాలే అనుకోండి. ఇప్పుడు కూడా అలాంటి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి పాకిస్తాన్ బోర్డు టీ20 టీమ్ కెప్టెన్సీ విషయం గురించి ఒకటే చర్చ జరుగుతోంది. షాహిన్ అఫ్రిది కెప్టెన్సీ నుంచి తప్పుకోగా టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి బాబార్ కే అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, సీనియర్స్ మాత్రం మాత్రమే కాదు.. షాహిన్ అఫ్రిదిలాంటి పాకిస్తాన్ మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షాహిన్ అఫ్రిది అయితే కెప్టెన్ గా బాబర్ పనికిరాడు అంటూ కామెంట్స్ చేశాడు. అతని స్థానంలో ఫలానా ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ తన మనసులో ఉన్న పేరుని కూడా చెప్పేశాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పుకునే బాబర్ కు ఇలా తన సీనియర్ కౌంటర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

మార్చి 31న పాకిస్తాన్ టీ20 టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి బాబర్ కు అప్పజెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అతనికి తిరిగి ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాల్సి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2023 టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యతగా కెప్టెన్సీ నుంచి బాబర్ ను తప్పుకోవాలని బోర్టు కోరింది. ఇంక చేసేది లేక బాబర్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలు పేస్ గుర్రం షాహిన్ అఫ్రిదికి ఇచ్చారు. కెప్టెన్ మారినా జట్టు ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి 4-1 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయారు.

మరోసారి కెప్టెన్ ని మార్చాల్సిందే అని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. కాకపోతే ఈసారి మళ్లీ పాత కెప్టెన్ కో మరోసారి అవకాశం ఇచ్చారు. మళ్లీ బాబర్ అజామే పాకిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. స్వదేశంలో ఈనెల 18 నుంచి న్యూజిల్యాండ్ జట్టుతో పాకిస్తాన్ టీమ్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ నుంచే బాబర్ మళ్లీ టీ20 జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు, పాక్ ప్యాన్స్ మాత్రమే కాకుండా.. పాకిస్తాన్ సీనియర్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షాహిద్ అఫ్రిది బాబర్ కెప్టెన్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తిరిగి బాబర్ నే కెప్టెన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

“మరోసారి టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఎంపిక కావడం నాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి టీ20 టీమ్ కెప్టెన్ గా బాబర్ అజామ్ స్థానంలో వికెట్ కీపర్/బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్ గా ఎంపిక చేసుంటే బాగుండేది. నిర్ణయం అయితే తీసేసుకున్నాను. నా మద్దతు ఎప్పుడూ పాక్ జట్టుకు, బాబర్ కు ఉంటాయి” అంటూ కామెంట్స్ చేశాడు. టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ అజామ్ పనికిరాడు అనే విధంగానే షాహిద్ అఫ్రిది ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యల వెనుక మరో కారణం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అల్లుడిని కెప్టెన్ గా తప్పించడంతో బాబర్ పై అక్కసుతో ఇలా రిజ్వాన్ బెటర్ అంటూ అఫ్రిది కామెంట్స్ చేశాడు అంటున్నారు. మరి.. కెప్టెన్ గా బాబర్ అజామ్ కంటే రిజ్వాన్ బెటర్ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.