iDreamPost
android-app
ios-app

అలా ఆడటం నా వల్ల కాదు! బాబర్‌ అజమ్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

  • Published Mar 06, 2024 | 5:54 PM Updated Updated Mar 06, 2024 | 5:54 PM

Babar Azam: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ తాజా తన ఆట గురించి సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాను అలా ఆడలేనని, అది తన స్ట్రెంత్‌ కాదంటూ పేర్కొన్నాడు. మరి బాబర్‌ చేసిన ఈ కామెంట్‌ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Babar Azam: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ తాజా తన ఆట గురించి సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాను అలా ఆడలేనని, అది తన స్ట్రెంత్‌ కాదంటూ పేర్కొన్నాడు. మరి బాబర్‌ చేసిన ఈ కామెంట్‌ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 06, 2024 | 5:54 PMUpdated Mar 06, 2024 | 5:54 PM
అలా ఆడటం నా వల్ల కాదు! బాబర్‌ అజమ్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజమ్‌ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అలా ఆడటం తన వల్ల కాదని, అది అసలు తన స్ట్రెంత్‌ కాదని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాటర్లలో బాబర్‌ ఒకడు. కొన్ని సార్లు అతన్ని ఏకంగా టీమిండియా సూపర్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో కూడా పోల్చేవారు. అలాంటి ఆటగాడు ఇప్పుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సింది. సాధారణంగా బాబర్‌ అజమ్‌ ఎంత అద్భుతంగా ఆడినా.. అతని స్టైక్‌రేట్‌పై విమర్శలు వస్తూనే ఉంటాయి. వన్డేలకు బాగా సరిపోయే బాబర్‌ ఆట.. టీ20ల విషయానికి వచ్చేసరికి స్ట్రైక్‌రేట్‌ విషయంలో అతనిపై చాలా విమర్శలు ఉన్నాయి. అతన్ని జింబాబర్‌ అని కూడా ట్రోల్‌ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బాబర్‌ అజమ్‌ తనపై వస్తున్న విమర్శలకు రియాక్ట్‌ అయ్యాడు. ‘చాలా మంది నా స్ట్రైక్‌రేట్‌ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను భారీ భారీ సిక్సులు కొట్టాలని ఆశపడుతుంటారు. కానీ, అది నా స్ట్రెంత్‌ కాదు. నేను నా స్ట్రంత్‌ ప్రకారం ఆడతా’ అంటూ పేర్కొన్నాడు. చాలా కాలంగా బాబర్‌పై ఈ విషయంలో విమర్శలు ఉన్నా.. ఎట్టకేలకు ఇప్పుడు స్పందించిన బాబర్‌ తన నేచురల్‌ గేమ్‌ అగ్రెసివ్‌ క్రికెట్‌ కాదని ఒప్పుకున్నాడు. అయితే.. చాలా సార్లు కోహ్లీతో బాబర్‌ను కంప్యార్‌ చేసిన కొంతమంది అభిమానులు మరి ఇప్పుడేం అంటారో చూడాలి. కోహ్లీ ఎలాగైన బ్యాటింగ్‌ చేయగలడు. అగ్రెసివ్‌గా ఆడగలడు, నిదానంగా ఆడగలడు ఎలా కావాలంటే అలా ఆడతాడు.

విజయానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ చెలరేగి మ్యాచ్‌ను గెలిపించగలడు. ఇదే విషయాన్ని టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సందర్భంగా పాకిస్థాన్‌పైనే నిరూపించాడు. కానీ, బాబర్‌ అజమ్‌ మాత్రం తాను వేగంగా ఆడలేడని, భారీ సిక్సులు కొట్టడం తన వల్లకాదంటూ ఒప్పుకున్నాడు. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 సీజన్‌లో ఆడుతున్న బాబర్‌. పెషావర్‌ జాల్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒక సెంచరీ కూడా చేశాడు. ముల్తాన్‌ సుల్తాన్‌ టీమ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి రాణించాడు. ఈ మ్యాచ్‌ తర్వాతే బాబర్‌ అజమ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి బాబర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.