Virat Kohli: కోహ్లీ కాదు.. ఆ విషయంలో వరల్డ్ నెంబర్ వన్ బాబరే: పాక్ మాజీ క్రికెటర్

విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయరే అయినప్పటికీ.. ఆ విషయంలో మాత్రం అతడే వరల్డ్ నెంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ పేసర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయరే అయినప్పటికీ.. ఆ విషయంలో మాత్రం అతడే వరల్డ్ నెంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ పేసర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో ఏలుతున్న రారాజు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం అతడి గణాంకాలను చూస్తేనే అర్ధం అవుతుంది. అయితే పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం ఎప్పుడూ కోహ్లీపై ఏడుస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి కోహ్లీని తక్కువ చేసి చూపించేలా కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ జాహిద్. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయరే అయినప్పటికీ.. ఆ విషయంలో మాత్రం అతడే వరల్డ్ నెంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఎప్పుడు పడి ఏడుస్తుంటారు. ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ జాహిద్. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ కంటే బాబర్ అజాం బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. కోహ్లీ కంటే బాబర్ దగ్గర టెక్నిక్ గొప్పగా ఉంటుంది. కానీ మ్యాచ్ కు సంబంధించిన నాలెడ్జ్ విషయాల్లో మాత్రం బాబర్ అంత గొప్పవాడు కాదు. ఈ విషయంలో స్టీవ్ స్మిత్, జో రూట్ గొప్పగా ఆలోచిస్తారు. మ్యాచ్ ను అంచనా వేయడంలో వీరిద్దరు సూపర్. వారి తర్వాతే బాబర్”

“ఇక విరాట్ కోహ్లీ గొప్ప బ్యాటర్ దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ నేను మాత్రం కోహ్లీ కంటే రోహితే గొప్ప బ్యాటర్ అని చెబుతాను. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో రోహిత్ సూపర్. బాల్ ను తొందరగా అంచనా వేసి, ఏ షాట్ ఆడాలో నిర్ణయించుకుంటాడు” అంటూ చెప్పుకొచ్చాడు జాహిద్. అయితే వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని కాదని, బాబర్, రోహిత్, రూట్, స్టీవ్ స్మిత్ ఇలా వీరిని ఎన్నుకున్నాడు పాక్ మాజీ పేసర్. ప్రస్తుతం ఇది అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments