Babar Azam: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌.. సొంత గడ్డపై పరువుతీసుకున్న బాబర్‌!

Babar Azam, PAK vs BAN: పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌, వైట్‌ బాల్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తన సొంత గడ్డపై పరువుతీసుకున్నాడు. బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే పిచ్‌పై తేలిపోయాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Babar Azam, PAK vs BAN: పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌, వైట్‌ బాల్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తన సొంత గడ్డపై పరువుతీసుకున్నాడు. బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే పిచ్‌పై తేలిపోయాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజమ్‌ తన సొంతగడ్డపై పరువుతీసుకున్నాడు. ఫ్లాట్‌గా ఉండి, బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండే.. పాకిస్థాన్‌ పిచ్‌ బాబర్‌ ఆజమ్‌ డకౌట్‌ అయ్యాడు. ర్యాకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉండే.. బాబర్‌ ఆజమ్‌ బ్యాటింగ్‌లో మాత్రం.. ఇలా డకౌట్లు అవుతున్నాడు. ఇలా ఆడుతున్నా.. అతను నంబర్‌ వన్‌ ఎలా అవుతున్నాడో తమకు అర్థం కావడం లేదంటూ క్రికెట్‌ అభిమానులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్‌లోనూ బాబర్‌ ఆజమ్‌ దారుణంగా ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌ చేరాడు.

పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు పాకిస్థాన్‌ వెళ్లింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో పాకిస్థాన్‌ చెత్త ప్రదర్శనతో బాబర్‌ ఆజమ్‌ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. మళ్లీ అతనికే టీ20, వన్డే కెప్టెన్సీ అప్పగించారు. అయితే.. టెస్టులకు మాత్రం షాన్‌ మసూద్‌ను కెప్టెన్‌ని చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో షాన్‌ మసూద్‌ కెప్టెన్సీలోనే పాకిస్థాన్‌ ఆడుతోంది. రావల్పిండి వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టాస్‌ గెలిచి.. తొలుత పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

అబ్దుల్లా షఫీక్‌తో కలిసి.. యువ క్రికెటర్‌ సైమ్‌ అయ్యూబ్‌ పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ షఫీక్‌ అవుట్‌ అయ్యాడు. హసన్‌ మహముద్‌ బౌలింగ్‌లో జాకిర్‌ హసన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన షాన్‌ మసూద్‌ 7వ ఓవర్‌ ఐదో బంతికి ఇస్లామ్‌ బౌలింగ్‌ లిట్టన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే 9వ వర్‌ రెండో బంతికి బాబర్‌ ఆజమ్‌ పరుగులు ఏమీ చేయకుండానే.. ఇస్లామ్‌ బౌలింగ్‌లోనే దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం సైమ్‌ అయ్యూబ్‌, సౌద్‌ షకీల్‌ క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. సొంత పిచ్‌పై కూడా బాబర్‌ ఆజమ్‌ డకౌట్‌ అవ్వడంతో పాక్‌ అభిమానులు షాక్‌ అయ్యారు. మరి బాబర్‌ డకౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments