Babar Azam: మ్యాచ్‌లు ఓడుతున్నా బాబర్‌ ఆజమ్‌కి తగ్గని క్రేజ్! ఈ లిటిల్ ఫ్యాన్ వీడియో వైరల్!

Babar Azam, PAK vs BAN, T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్‌ గెలిచిన తర్వాత పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చేసిన పని వైరల్‌గా మారింది. అంతకంటే ముందు ఓ చిన్నారి బాబర్‌ను చూసి ఏడ్చేసింది. దాంతో బాబర్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Babar Azam, PAK vs BAN, T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్‌ గెలిచిన తర్వాత పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చేసిన పని వైరల్‌గా మారింది. అంతకంటే ముందు ఓ చిన్నారి బాబర్‌ను చూసి ఏడ్చేసింది. దాంతో బాబర్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను చూడగానే ఓ చిన్నారి బోరున ఏడ్చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌ వర్సెస్‌ కెనడా మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ కుర్రాడు బాబర్‌ను చూసి ఎందుకు ఏడ్చాడు. అతన్ని చూసి భయపడ్డడా? లేక బాబర్‌ ఏమైనా అన్నాడా? అని క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. అయితే.. ఆ చిన్నారి ఫ్యాన్‌ బాబర్‌ను చూసి భయపడి ఏడవలేదు. తన అభిమాన క్రికెటర్‌ను కలిసే సరికి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే.. చిన్నరి అలా ఏడుస్తుండటంతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కంగారు పడ్డాడు. ఏమైందో తెలుసుకోవడానికి ఆపసోపాలు పడ్డాడు.

ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నాడో ముందు బాబర్‌కు అర్థం కాలేదు. కొద్దిసేపు ఆ చిన్నారిని బతిమాలితే.. అసలు విషయం చెప్పాడు. ఆ చిన్నారి బాబర్‌కు చాలా పెద్ద అభిమాని. పాకిస్థాన్‌, కెనడా మ్యాచ్‌ సందర్భంగా.. నేషనల్‌ ఆంథమ్‌ కోసం జట్టు ఆటగాళ్లు చిన్నారులతో కలిసి వస్తారు.. ఆ సమయంలో ఆ చిన్నారి ఫ్యాన్‌ బాబర్‌ చేయి పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ స్పెషల్‌ మూమెంట్స్‌తో చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని ఓదార్చిన బాబర్‌.. మ్యాచ్‌ తర్వాత ఆ కుర్రాడికి తన గ్లౌవ్స్‌ ఇచ్చాడు. తన చిన్నారి ఫ్యాన్‌కు చిన్న గిఫ్ట్‌ ఇచ్చినట్లు బాబర్‌ మ్యాచ్‌ తర్వాత చెప్పుకొచ్చాడు. దాంతో.. ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఆ కుర్రాడు.. బాబర్‌ ఇచ్చిన గిఫ్ట్‌తో ఫుల్‌ హ్యాపీ అయ్యాడు. ఈ ఘటన చూసిన వాళ్లు.. పాక్‌ వరుస మ్యాచ్‌లు ఓడినా.. బాబర్‌ ఆజమ్‌ క్రేజ్‌ తగ్గడం లేదని అంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ జాన్సన్‌ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి కెనడా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా రాణించలేదు. పాక్‌ బౌలర్లలో ఆమీర్‌, హరీస్‌ రౌఫ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది.. రిజ్వాన్‌ 53, బాబర్‌ 33 పరుగులు చేశారు. మరి ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ చిన్నారి ఫ్యాన్‌ ఏడ్వడం, అతనికి బాబర్‌ చిన్న గిఫ్ట్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments