iDreamPost

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన బాబర్.. గేల్, కోహ్లీ కూడా ఇతడి వెనకే!

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజాం మాత్రం వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజాం మాత్రం వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన బాబర్.. గేల్, కోహ్లీ కూడా ఇతడి వెనకే!

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ.. విమర్శల పాలవుతూ ఉంటాడు. అయితే రికార్డుల విషయంలో మాత్రం బాబర్ ని గొప్ప ఆటగాడిగా ఒప్పుకోకతప్పదు. 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం తాజాగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ కు తొలి మ్యాచ్ లోనే ఊహించని షాకిచ్చింది పసికూన ఐర్లాండ్. ఫస్ట్ మ్యాచ్ లోనే పాక్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఇంకో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోయినప్పటికీ.. బాబర్ మాత్రం ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఈ లిస్ట్ లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలు కూడా బాబర్ వెనకే ఉండటం గమనార్హం.

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ 5 వికెట్లతో చిత్తైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజం 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పాడు బాబర్. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే? టీ20ల్లో అత్యంత వేగంగా వందకు పైగా 50+ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా 29 ఏళ్ల బాబర్ అజాం చరిత్ర నెలకొల్పాడు.

ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముందున్నాడు. ఆ తర్వాత క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు పాక్ కెప్టెన్. ఇదిలా ఉండగా.. ఐర్లాండ్ తో సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ కోసం ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది. కానీ ఇలా ఐర్లాండ్ లాంటి పసికూన జట్టు చేతిలో ఓడిపోవడంతో.. ఇదేనా మీ ఆర్మీ ట్రైనింగ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. మరి రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్న పాక్ కెప్టెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి