ప్రత్యర్థులకు దేవుడిలా మారిన బాబర్ ఆజమ్‌! కారణం ఇదే..!

ప్రత్యర్థులకు దేవుడిలా మారిన బాబర్ ఆజమ్‌! కారణం ఇదే..!

Babar Azam, T20 World Cup 2024, Slow Batting: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ప్రత్యర్థి జట్లకు దేవుడిలా మారిపోతున్నాడు. ఇకపై అతన్ని అవుట్‌ చేయడానికి కూడా ఏ టీమ్‌ ఇష్టపడటం లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Babar Azam, T20 World Cup 2024, Slow Batting: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ప్రత్యర్థి జట్లకు దేవుడిలా మారిపోతున్నాడు. ఇకపై అతన్ని అవుట్‌ చేయడానికి కూడా ఏ టీమ్‌ ఇష్టపడటం లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను కొంతమంది మరో విరాట్‌ కోహ్లీ అన్నారు. కోహ్లీ పేరు చెబితే చాలా దేశాలు వామ్మో.. అంటారు. కానీ, ఇప్పుడు బాబర్‌ ఆజమ్‌ పేరు చెబితే మా దేవుడు అంటున్నారు. కోహ్లీ అంటే భయపడే దేశాలు.. బాబర్‌ను తమ వాడిగా భావిస్తున్నాయి. ఈ తేడా ఎందుకంటే.. కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే.. బాబర్‌ ఆజమ్‌ మాత్రం స్లో ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్ల విజయానికి దోహదం చేస్తున్నాడు. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి.. సూపర్‌ ఓవర్‌ వరకు దారి తీసింది. చివరి పాక్‌పై విజయం సాధించి అమెరికా చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ 44 పరుగులు చేశాడు. కానీ, 43 బంతులు తీసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఆరంభంలోనే తన ఓపెనింగ్‌ పార్ట్నర్‌ రిజ్వాన్‌ అవుట్‌ కావడం, తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు పడిపోవడంతో బాబర్‌ ఆజమ్‌ కాస్త ఆచీ తూచీ బ్యాటింగ్‌ చేశాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ, చాలా కాలంగా టీ20 క్రికెట్‌లో బాబర్‌ ఆజమ్‌ ఇదే తరహా ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. టీ20ల్లో వన్డే, టెస్ట్‌ తరహా ఇన్నింగ్సులు ఆడుతూ.. పాకిస్థాన్‌ జట్టుకు భారంగా, ప్రత్యర్థి జట్లకు వరంగా మారుతున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రతీ టీమ్‌ గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే బాబర్‌ ఆజమ్‌ను ఎలా అవుట్‌ చేయాలనే విషయంపై ఏ టీమ్‌ కూడా ఫోకస్‌ చేయడం లేదని టాక్‌.

బాబర్‌ ఆజమ్‌ను ఎలా అవుట్‌ చేయాలని ప్రత్యేక ప్లానింగ్‌ ఏం లేకుండా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాయి మిగతా టీమ్స్‌. బాబర్‌ అవుట్‌ కాకుండా ఉంటేనే మంచిదని, వన్డే, టెస్టు ఇన్నింగ్స్‌లతో ఎక్కువ బాల్స్‌ ఆడి నామమాత్రపు స్కోర్‌ చేస్తాడని దాంతో తమకు పెద్దగా నష్టం లేదని భావిస్తున్నాయట ప్రత్యర్థి జట్లు. ఒకరకంగా చెప్పాలంటే.. బాబర్‌ ఆజమ్‌ అవుట్‌ కాకుండా క్రీజ్‌లోనే ఉండాలని ప్రత్యర్థి టీమ్స్‌ కోరుకుంటున్నాయి. అందుకే గురువారం జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ను అవుట్‌ చేయడానికి అమెరికా పెద్దగా ప్రయత్నం చేయలేదనే జోకులు కూడా పేలుతున్నాయి. బాబర్‌ స్లో బ్యాటింగ్‌ కారణంగా పాక్‌ 20 ఓవర్లలో కేవలం 159 పరుగులు చేసిందని, అదే వాళ్ల ఓటమికి కారణమని అంటున్నారు క్రికెట్‌ అభిమానులు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments