iDreamPost
android-app
ios-app

మ్యాచ్ ఓడినా.. బాబర్ క్రేజీ రికార్డు! వరల్డ్ క్రికెట్ లో ఇద్దరికే ఇది సాధ్యమైంది..

  • Published May 31, 2024 | 1:27 PM Updated Updated May 31, 2024 | 1:27 PM

ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ రికార్డ్ ఇద్దరికే సాధ్యమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ రికార్డ్ ఇద్దరికే సాధ్యమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

మ్యాచ్ ఓడినా.. బాబర్ క్రేజీ రికార్డు! వరల్డ్ క్రికెట్ లో ఇద్దరికే ఇది సాధ్యమైంది..

టీ20 వరల్డ్ కప్ 2024 ముందు పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన 4 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో కోల్పోయింది. రెండు మ్యాచ్ లు వర్షార్ఫణం కాగా.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. నాలుగో టీ20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ రికార్డ్ ఇద్దరికే సాధ్యమైంది. మరి ఆ రికార్డ్ ఏంటి? బాబర్ కంటే ముందున్న ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎన్ని విమర్శలు వస్తున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ.. ప్రపంచ క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో 36 పరుగులు చేశాడు బాబర్. ఈ మ్యాచ్ లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ గా బాబర్ నిలిచాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించింది ఇద్దరే ప్లేయర్లు కావడం విశేషం.

బాబర్ అజామ్ కంటే ముందే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ 117 టీ20ల్లో 4037 పరుగులు చేశాడు. బాబర్ 119 మ్యాచ్ ల్లో 4023 రన్స్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 151 టీ20ల్లో 3974 పరుగులతో మూడో ప్లేస్ లో ఉన్నాడు.  కాగా.. టీ20 వరల్డ్ కప్ ముందు సిరీస్ గెలిచి.. పాకిస్తాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టింది ఇంగ్లండ్. ఇక ఈ పొట్టి ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాళ్ల జాబితాలో బాబర్ అజామ్ కూడా ఉన్నాడు. మరి వరల్డ్ క్రికెట్ లో ఈ అరుదైన రికార్డ్ సాధించిన బాబర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.