iDreamPost
android-app
ios-app

బాబర్ పరువు మళ్లీ పోయింది.. ఒరేయ్ ఆజామూ ఇంతకంటే దారుణం ఉండదు!

  • Published Mar 21, 2024 | 12:54 PM Updated Updated Mar 21, 2024 | 1:00 PM

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. ప్రతి దానికి విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకునే బాబర్​కు ఈ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది.

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. ప్రతి దానికి విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకునే బాబర్​కు ఈ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది.

  • Published Mar 21, 2024 | 12:54 PMUpdated Mar 21, 2024 | 1:00 PM
బాబర్ పరువు మళ్లీ పోయింది.. ఒరేయ్ ఆజామూ ఇంతకంటే దారుణం ఉండదు!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తాడు. గేమ్ కంటే కూడా తన యాక్షన్స్​తోనే అతడు వైరల్ అవుతుంటాడు. చిన్న జట్ల మీద తన బ్యాట్ ప్రతాపం చూపించే బాబర్.. పెద్ద జట్లపై, అలాగే కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తుంటాడు. అయినా పాకిస్థాన్ అభిమానులు మాత్రం అతడికి బాగా హైప్ ఇస్తుంటారు. అంతేగాక ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో బాబర్​ను కంపేర్ చేస్తుంటారు. అయితే ఫిట్​నెస్, బ్యాటింగ్ స్కిల్స్, రికార్డ్స్.. ఇలా ఏ విధంగా చూసుకున్నా కోహ్లీ ముందు బాబర్ జూజూబీ అని క్రికెట్ అనలిస్టులు అంటుంటారు. అలాంటి బాబర్ మరోమారు పరువు పోగొట్టుకున్నాడు. అతడికి జరిగిన దాని గురించి తెలిస్తే.. ఒరేయ్ ఆజామూ ఇంతకంటే దారుణం ఉండదని ఎవరైనా అనాల్సిందే.

పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్​కు ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ అయిన ‘ది హండ్రెడ్’లో వరుసగా మూడోసారి వీళ్లిద్దరూ అన్​సోల్డ్​గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్-2024 సీజన్ డ్రాఫ్ట్​లో బాబర్, రిజ్వాన్​ను సొంతం చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్క ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో వీళ్లు అమ్ముడుపోకుండా అలాగే మిగిలిపోయారు. ఈ ఇద్దరు పాక్ స్టార్లతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్, ఆసీస్ యంగ్ సెన్సేషన్ టిమ్ డేవిడ్ కూడా అన్​సోల్డ్​గా ఉండటం గమనార్హం. బాబర్, రిజ్వాన్​ను ఎవరూ పట్టించుకోనప్పటికీ వాళ్ల సహచర ఆటగాళ్లు షాహీన్ ఆఫ్రిది, ఇమాద్ వసీం, నసీం షా మాత్రం డ్రాఫ్ట్​లో అమ్ముడుపోవడం విశేషం. షాహిన్​ను లక్ష పౌండ్లకు వెల్ష్​ ఫైర్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.

Babars reputation is lost again!

లాస్ట్ సీజన్​లో కూడా షాహిన్ ఆఫ్రిదీ వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీకే ఆడాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్ టీమ్ సొంతం చేసుకుంది. నసీం షాను బర్మింగ్​హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ది హండ్రెడ్ డ్రాఫ్ట్​లో విండీస్ క్రికెటర్స్​కు భారీ డిమాండ్ నెలకొంది. ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్, హెట్​మెయిర్ లాంటి కరీబియన్ స్టార్లు ఫస్ట్ రౌండ్​లోనే అమ్ముడుపోయారు. పూరన్​ను నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. రస్సెల్, హెట్​మెయిర్​ను లండన్ స్పిరిట్​ దక్కించుకుంది. మరోవైపు విమెన్స్ ది హండ్రెడ్ లీగ్​లో టీమిండియా కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ అన్​సోల్డ్​గా మిగిలిపోయింది. అయితే స్మృతి మంధాన, రిచా ఘోష్ మాత్రం డ్రాఫ్ట్​లో సెలక్ట్ అయ్యారు. స్మృతిని సదరన్ బ్రేక్ సొంతం చేసుకుంది. రిచాను బర్మింగ్​హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. మరి.. బాబర్ ఇంకోసారి పరువు పోగొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCB బలం, బలహీనతలు! అమ్మాయిల నుంచి స్ఫూర్తి పొందుతారా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom