iDreamPost
android-app
ios-app

వీడియో: 110 కేజీల బరువున్న కీపర్‌.. కళ్లు చెదిరే క్యాచ్‌!

  • Published Mar 05, 2024 | 1:55 PM Updated Updated Mar 05, 2024 | 1:55 PM

Azam Khan: 110 కేజీల బరువున్న ఓ వికెట్‌ కీపర్‌ ఇలాంటి క్యాచ్‌ పట్టాడా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజంగానే అతను అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. మరి ఈ సూపర్‌ క్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Azam Khan: 110 కేజీల బరువున్న ఓ వికెట్‌ కీపర్‌ ఇలాంటి క్యాచ్‌ పట్టాడా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజంగానే అతను అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. మరి ఈ సూపర్‌ క్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 1:55 PMUpdated Mar 05, 2024 | 1:55 PM
వీడియో: 110 కేజీల బరువున్న కీపర్‌.. కళ్లు చెదిరే క్యాచ్‌!

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు చూస్తే వావ్‌ అనిపిస్తుంది. కానీ, మరికొన్ని క్యాచ్‌లు మాత్రం అస్సలు నమ్మశక్యంగా ఉండవ్‌. కనీసం మూడు నాలుగు సార్లు రీప్లేలో చూస్తేకానీ.. ఆటగాడు ఆ క్యాచ్‌ను అలా ఎలా పట్టాడో అర్థం కాదు. వాళ్ల కొట్టే డైవ్‌, రియాక్షన్‌ టైమ్‌, డైవ్‌ కొట్టే డైమెన్షన్స్‌ ఇలా ఒక్కో క్యాచ్‌లో ఒక్కోటి హైలెట్‌ అవుతూ ఉంటాయి. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే క్యాచ్‌ అయితే.. ఒక ఒక్క యాంగిల్‌లో కాకుండా.. అన్ని యాంగిల్స్‌లో అదరహో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ క్యాచ్‌ పట్టిన వికెట్‌ కీపర్‌ ఏకంగా 110 కేజీల బరువు ఉంటాడు. ఇంత బరువుండే వ్యక్తి క్రికెట్‌ ఆడటమే గొప్ప విషయం అనుకుంటే.. ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌లు పట్టి అబ్బరపరుస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాచ్‌ పట్టింది ఎవరు? ఏ మ్యాచ్‌లో? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చిత్రవిచిత్రమైన నవ్వులపాలయ్యే ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు పాకిస్థాన్‌ క్రికెటర్లు. కానీ, ఆ టీమ్‌లో కూడా కొంతమంది మంచి ఫీల్డింగ్‌ చేసే వాళ్లు ఉన్నారు. అలాంటి అతి తక్కువ మందిలో ఒకడు వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అజమ్‌ ఖాన్‌. పాకిస్థాన్‌ జాతీయ జట్టులో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ.. టీ20 లీగ్స్‌లో ఎక్కువగా హడావుడి చేసే అజమ్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ హల్క్‌గా పేరున్న ఈ క్రికెటర్‌ తాజాగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మంచి ఫీల్డింగ్‌ చేయడానికి, కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడానికి వికెట్‌ కీపర్‌కు తన శరీర బరువుతో సంబంధం లేదని నిరూపిస్తూ.. ఔరా అనిపించే క్యాచ్‌ను గాల్లో ఎగురుతూ అందుకున్నాడు. ఆ క్యాచ్‌తో అజమ్‌ ఖాన్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతుంది.

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2024లో భాగంగా సోమవారం పెషావర్‌ జాల్మీ, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సూపర్‌ క్యాచ్‌ చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ తరఫున ఆడుతున్న అజమ్‌ ఖాన్‌.. పెషావర్‌ బ్యాటర్‌ టామ్ కోహ్లర్-కాడ్మోర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. హునైన్‌ షా వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ తొలి బంతిని టామ్ కోహ్లర్-కాడ్మోర్ పాయింట్‌ దిశగా ఆడదాం అనుకున్నాడు. కానీ, బాల్‌ ఎడ్జ్‌ తీసుకోని.. వికెట్‌ కీపర్‌ అజమ్‌ ఖాన్‌ కుడి వైపుకు బుల్లెట్‌లా దూసుకొచ్చింది. తనకు చాలా దూరంగా వెళ్తున్న బంతిని అమాంతం దూకి.. కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు అజమ్‌ ఖాన్‌. అది చూసి బ్యాటర్‌ టామ్ కోహ్లర్-కాడ్మోర్ సైతం ఆశ్చర్యపోయాడు. మరి 110 కేజీల బరువున్న అజమ్‌ ఖాన్‌ ఇలాంటి క్యాచ్‌ పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.