Ayodhya Ram Mandir: పాక్​లోనూ శ్రీరాముడి నామస్మరణ.. నినాదాలతో హోరెత్తిస్తున్న దాయాది క్రికెటర్!

ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. మన దేశంలోనే కాదు.. దాయాది దేశం పాకిస్థాన్​లోనూ రాముడి కీర్తనలు ఊపందుకుంటున్నాయి. ఓ పాక్ క్రికెటర్ బోలో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నాడు.

ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. మన దేశంలోనే కాదు.. దాయాది దేశం పాకిస్థాన్​లోనూ రాముడి కీర్తనలు ఊపందుకుంటున్నాయి. ఓ పాక్ క్రికెటర్ బోలో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నాడు.

శ్రీరాముడి భక్తుల ఎదురుచూపులకు త్వరలోనే ముగింపు పడనుంది. అయోధ్యలోని భవ్య రామ మందిరంలోని బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 22వ తేదీన దీనికి సంబంధించిన కార్యక్రమం గ్రాండ్ ​గా జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ ప్రోగ్రామ్​లో సుమారు 11 వేల మందికి పైగా అతిథులు హాజరవుతారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భవ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణ వినిపిస్తోంది. అయితే శత్రుదేశం పాకిస్థాన్​లోనూ రాముడి కీర్తనలు వినపడటం గమనార్హం. పాక్ మాజీ క్రికెటర్ ఒకరు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నాడు.

పాకిస్థాన్​లో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్న క్రికెటర్ మరెవరో కాదు.. డానిష్ కనేరియా. పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా కాషాయ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నాడు. భవ్య రామమందిరాన్ని సందర్శించడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం మీద కనేరియా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇందులో చేతిలో కాషాయ జెండా పట్టుకొని కనిపించాడు కనిరేయా. ‘అయోధ్యలో మన ప్రభువు శ్రీరాముడి భవ్య మందిరం సిద్ధంగా ఉంది. ఆలయంలో ప్రాణ ప్రతిష్టాపన పనులకు ఇంకో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. బోలో జైశ్రీరామ్’ అని కనేరియా ట్వీట్ చేశాడు. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన భారత క్రికెట్ అభిమానులు బోలో జైశ్రీరామ్ అంటున్నారు.

ఇక, డానిష్ కనేరియా కెరీర్ విషయానికొస్తే.. అతడు చాలా ఏళ్ల పాటు పాకిస్థాన్​ క్రికెట్​ టీమ్​కు సేవలు అందించాడు. 61 టెస్టులు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్.. 261 వికెట్లు తీశాడు. 18 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 15 వికెట్లు.. 65 టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫస్ట్​క్లాస్ కెరీర్​లో మాత్రం 206 మ్యాచులు ఆడి ఏకంగా 1,024 వికెట్లు తీశాడు. పాకిస్థాన్​ టీమ్​కు ఆడిన సమయంలో సహచర క్రికెటర్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో వాపోయాడు కనేరియా. తనను మతం మారాల్సిందిగా కొందరు పాక్ ప్లేయర్లు ఒత్తిడి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు హిందూ సంప్రదాయాలు, భారతీయ ఆచార వ్యవహారాలు అంటే చాలా గౌరవం ఉందని బహిరంగంగానే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా అయోధ్య రామాలయంపై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. మరి.. బోలో జైశ్రీరామ్ అంటూ పాక్ ప్లేయర్ నినదించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Romario Shepherd: వీడియో: సైన్స్‌కే ఛాలెంజ్‌ విసురుతున్న సెన్సేషనల్‌ క్యాచ్‌!

Show comments