iDreamPost

Romario Shepherd: వీడియో: సైన్స్‌కే ఛాలెంజ్‌ విసురుతున్న సెన్సేషనల్‌ క్యాచ్‌!

  • Published Jan 16, 2024 | 11:45 AMUpdated Jan 16, 2024 | 11:45 AM

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు చూస్తే.. వావ్‌ ఏం పట్టాడు కదా అనిపిస్తుంది. కానీ, కొన్ని క్యాచ్‌లు చూస్తే మాత్రం అసలు అలా ఎలా పట్టాడు రా బాబు అని షాక్‌తో కూడిన ఒక డౌట్‌ వస్తుంది. ఈ క్యాచ్‌ కూడా అలాంటిదే. చూస్తే మీరేం అంటారు.. సూపర్‌ అని.

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు చూస్తే.. వావ్‌ ఏం పట్టాడు కదా అనిపిస్తుంది. కానీ, కొన్ని క్యాచ్‌లు చూస్తే మాత్రం అసలు అలా ఎలా పట్టాడు రా బాబు అని షాక్‌తో కూడిన ఒక డౌట్‌ వస్తుంది. ఈ క్యాచ్‌ కూడా అలాంటిదే. చూస్తే మీరేం అంటారు.. సూపర్‌ అని.

  • Published Jan 16, 2024 | 11:45 AMUpdated Jan 16, 2024 | 11:45 AM
Romario Shepherd: వీడియో: సైన్స్‌కే ఛాలెంజ్‌ విసురుతున్న సెన్సేషనల్‌ క్యాచ్‌!

క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టుకోవడం సాధారణ విషయమే. కానీ, కొన్ని క్యాచ్‌లు అద్భుతంగా ఉంటాయి. ఫీల్డర్లు పాదరసంలా కదులుతూ.. వారి ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటూ ఉంటారు. టీమిండియాలో విరాట్‌ కోహ్లీ, జడేజా, రింకూ సింగ్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫీల్డర్లుగా ఉన్నారు. వీరు అందుకునే కొన్ని క్యాచ్‌లు అసాధారణంగా ఉంటాయి. అసలు అలా ఎలా పట్టాడు? అనే డౌట్‌ కూడా వస్తుంది. ఆ క్యాచ్‌ను ఒకటికి పది సార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించేంత కిక్‌ ఇస్తుంది. అలాంటి అద్భుతమైన క్యాచ్‌లు ఏ మ్యాచ్‌లో చోటుచేసుకున్నా.. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి ఒక అద్భుతమైన క్యాచ్‌ ఒకటి సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. ఆ క్యాచ్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు.. అసలు ఇది ఎలా సాధ్యమైంది? సైన్స్‌కి, గ్రావిటీ ఫోర్స్‌కే ఛాలెంజ్‌ విసిరేలా ఉందిగా ఈ క్యాచ్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి ఆ క్యాచ్‌ ఎవరు పట్టారు? ఏ మ్యాచ్‌లో పట్టారు లాంటి విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్‌ఏటీ20 లీగ్‌లో సోమవారం డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌-జోహన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే క్యాచ్‌ ఒకటి ఆవిష్కృతమైంది. సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ నంద్రే బర్గర్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ ఐదో బంతిని డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ మాథ్యూ బ్రీట్జ్కే మిడ్‌ వికెట్‌ వైపు ఆడాడు. రాకెట్‌లా దూసుకెళ్తున్న ఆ బంతిని.. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోమారియో షెఫర్డ్‌ గాల్లోకి అమాంతం ఎగిరి.. లటుక్కున అందుకున్నాడు. జస్ట్‌ అలా రెప్పపాటు కాలంలో అంతా జరిగిపోయింది. అసలు ఆ బాల్‌ను షెఫర్డ్‌ ఎలా అందుకున్నాడో.. కొద్ది సేపు అక్కడున్నవారికి అర్థం కాలేదు. అంతా అవాక్కై చూస్తున్నారు. బ్యాటర్‌ సైతం షాక్‌ అయ్యాడు. చివరి కెమెరా మెన్‌ సైతం ఆ బాల్‌ బౌండరీకి వెళ్లి ఉంటుందని.. కెమెరాను అటే ఫోకస్‌ చేశాడు. కానీ, బాల్‌ షెఫర్డ్‌ చేతుల్లో చిక్కిపోయింది. రీప్లేలో చూస్తే కానీ అసలు విషయం అర్థం కాలేదు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న షెఫర్డ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్లాసెన్‌ 41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో.. డర్బన్‌ 145కే పరిమితం అయింది. అయితే.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో డర్బన్‌ బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. టోప్లీ 3, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ 2, రిచర్డ్‌ 2 వికెట్లుతో సత్తా చాటారు. సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో హెండ్రిక్స్‌ 38, మొయిన్‌ అలీ 36 మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లంతా చేతులు ఎత్తేయడంతో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో షెఫర్డ్‌ అందుకున్న సెన్సేషనల్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి