SNP
Axar Patel, Jasprit Bumrah, IND vs AFG, T20 World Cup 2024: ఓ స్టార్ ప్లేయర్‌తో టీమ్‌లోని మిగతా ప్లేయర్లు, కెప్టెన్, కోచ్‌లు ఎవరూ పెద్దగా మాట్లాడరంటూ అక్షర్ పటేల్ ఓ బాంబు పేల్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు అతనితో మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
Axar Patel, Jasprit Bumrah, IND vs AFG, T20 World Cup 2024: ఓ స్టార్ ప్లేయర్‌తో టీమ్‌లోని మిగతా ప్లేయర్లు, కెప్టెన్, కోచ్‌లు ఎవరూ పెద్దగా మాట్లాడరంటూ అక్షర్ పటేల్ ఓ బాంబు పేల్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు అతనితో మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే రోహిత్ సేన విజయఢంకా మోగించి.. మంచి స్టార్ట్ అందుకుంది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ఓ స్టార్ ప్లేయర్‌తో ఎవరూ పెద్దగా మాట్లాడని, ఇలా చేయాలని, అలా చేయాలని.. బౌలింగ్ ఇలా వేయాలి, అలా వేయాలి అంటూ అతనితో ఎవరు పెద్దగా డిస్కర్స్ చేయరంటూ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు మన బూమ్ బూమ్ బుమ్రా.
టీమిండియాకు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద దిక్కుగా.. ప్రత్యర్థిలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇన్నేళ్లుగా అదే పదునైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ 2022లో బుమ్రా లేని లోటు చాలా స్పష్టంగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సారి ఆ బెంగ అక్కర్లే.. పాకిస్థాన్‌పై 119 పరుగులు చేసినా.. మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్నోడు బుమ్రా ఇప్పుడు టీమ్‌లో ఉన్నాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.
బుమ్రా ఇంత సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడంటే అతని ప్రత్యేకమైన బౌలింగ్ శైలితో పాటు అతని టెక్నిక్స్ అందుకు ప్రధాన కారణం. అందుకే జట్టులోని ఏ ప్లేయర్ కూడా బుమ్రాతో బౌలింగ్ విషయంలో పెద్ద చర్చ చేయరని, ప్లేయర్లే కాదు బౌలింగ్ కోచ్, హెడ్ కోచ్ కూడా బౌలింగ్ ఎలా చేయాలనే విషయంలో బుమ్రాతో అస్సలు మాట్లాడని, అలా మాట్లాడితే బుమ్రాలో కన్ఫ్యూజన్ పెరుగుతుందని, అలా కాకుండా బుమ్రాను పూర్తిగా నమ్మి, అతన్ని ఫ్రీగా వదిలేస్తారని.. బుమ్రా తన సొంత ప్లాన్స్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్‌ను అనవసరంగా గెలికి, అలా చేయాలి, ఇలా చేయాలని అతని మైండ్‌ను పాడు చేయడం కంటే.. జస్ట్ అతని ఆటను ఎంజాయ్ చేస్తే చాలని టీమిండియా కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. అదే విషయాన్ని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. గ్రౌండ్‌లో కూడా బుమ్రాకు కెప్టెన్లు పెద్దగా సలహాలు ఇస్తూ కూడా కనిపించరు. దటీజ్ బుమ్రా. టీమిండియాకు దొరికి ఒక వజ్రాయుధం. మరి బుమ్రా గురించి అక్షర్ పటేల్ చెప్పిన ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Axar Patel “Bowling coach doesn’t interfere much with Jasprit Bumrah.He says during planning that whatever your mindset is,it is clear,so just execute your plans,so that there is no confusion in his mind”
Coaches take coaching from Bumrah,he is that goodpic.twitter.com/5S901lUoVJ
— Sujeet Suman (@sujeetsuman1991) June 21, 2024