iDreamPost

IND vs ENG: వీడియో: పోప్‌ క్యాచ్‌ వదిలేసిన అక్షర్‌ పటేల్‌! జడేజా రియాక్షన్‌ చూడండి!

ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్ ను టీమిండియా స్టార్ ప్లేయర్ అక్షర్ పటేల్ డ్రాప్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్ ను టీమిండియా స్టార్ ప్లేయర్ అక్షర్ పటేల్ డ్రాప్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

IND vs ENG: వీడియో: పోప్‌ క్యాచ్‌ వదిలేసిన అక్షర్‌ పటేల్‌! జడేజా రియాక్షన్‌ చూడండి!

‘టేక్ ది క్యాచ్.. విన్ ది మ్యాచ్’ ఈ సామెత గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క క్యాచ్ మిస్ అయితే మ్యాచ్ తో పాటుగా సిరీస్ లు, వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో చేజారిపోయిన సంఘటనలు చరిత్రలో మనం ఎన్నో చూశాం. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ క్యాచ్ ను వదిలేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్ ను డ్రాప్ చేశాడు అక్షర్. దీంతో మ్యాచ్ లో పట్టు సాధించే దిశగా పయనిస్తోంది ఇంగ్లాండ్. ఇక క్యాచ్ వదిలేసిన తర్వాత జడేజా ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు సడలించింది. మూడో రోజు ఆటలో పై చేయి సాధించినట్లుగానే కనిపించినా.. ఆట ముగిసేసరికి కాస్త తగ్గింది. తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. దీంతో 190 పరుగుల కీలక ఆధిక్యం టీమిండియాకు లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 163 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి టైమ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరొట్టాడు టాపార్డర్ బ్యాటర్ ఓలీ పోప్. మూడో రోజు ఆటముగిసే సమయానికి 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేసి క్రీజ్ లో నాటౌట్ గా నిలిచాడు పోప్.

ఈ క్రమంలోనే ఓ వైపు వికెట్లు పడుతున్నా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు ఈ ఆటగాడు. అయితే 110 పరుగుల వద్ద పోప్ అవుటైయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 64వ ఓవర్ లో వేసిన 4వ బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు పోప్. ఆ బాల్ కాస్త గల్లీ స్లిప్ లో ఉన్న అక్షర్ పటేల్ వైపు వెళ్లింది. బంతిని గాల్లోకి ఎగిరి అందుకునే క్రమంలో క్యాచ్ మిస్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురైయ్యారు. జడేజా కింద కూర్చుని తల పట్టుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ క్యాచ్ అక్షర్ అందుకొని ఉంటే.. కచ్చితంగా ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యి ఉండేది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆటముగిసే సరికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. దీంతో 126 పరుగుల ఆధిక్యం లభించింది. క్రీజ్ లో ఓలీ పోప్ (148*), రెహన్ అహ్మద్(16*) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెసిందే. మరి ఇంగ్లాండ్ ఇంత స్కోర్ చేయడానికి కారణం అక్షర్ వదిలేసిన క్యాచ్ ఏనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి