iDreamPost
android-app
ios-app

IND vs SA: తొలి టెస్ట్‌లో ఓటమి.. వెంటనే ఇండియా నుంచి స్పెషలిస్ట్‌ను రప్పించిన రోహిత్‌!

  • Published Dec 30, 2023 | 11:00 AM Updated Updated Dec 30, 2023 | 11:03 AM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. కనీసం రెండో టెస్ట్‌లోనైనా గెలవాలని రోహిత్‌ బలంగా ఫిక్స్‌ అయ్యాడు. అందుకోసం ఓ స్పెషలిస్ట్‌ ప్లేయర్‌ను రంగంలోకి దించుతున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. కనీసం రెండో టెస్ట్‌లోనైనా గెలవాలని రోహిత్‌ బలంగా ఫిక్స్‌ అయ్యాడు. అందుకోసం ఓ స్పెషలిస్ట్‌ ప్లేయర్‌ను రంగంలోకి దించుతున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 30, 2023 | 11:00 AMUpdated Dec 30, 2023 | 11:03 AM
IND vs SA: తొలి టెస్ట్‌లో ఓటమి.. వెంటనే ఇండియా నుంచి స్పెషలిస్ట్‌ను రప్పించిన రోహిత్‌!

సౌతాఫ్రికాతో సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకు సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ గెలవని టీమిండియా.. కనీసం ఈ సారైనా ఆ చెత్త రికార్డును బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తుందని క్రికెట్‌ అభిమానులు భావించగా.. వారి ఆశలు నీరుగారుస్తూ తొలి టెస్ట్‌లో ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది రోహిత్‌ సేన. దీంతో.. కనీసం రెండో టెస్టులో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సౌతాఫ్రికాను సౌతాఫ్రికాలో ఓడించడం అంత సులువైన విషయం కాకపోయినా.. స్టార్లతో కూడిన భారత జట్టు కనీసం పోటీ ఇవ్వాలని భావిస్తోంది. రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

సఫారీల ఆటకట్టించేందుకు రెండో టెస్ట్‌ కోసం ఒక స్పెషలిస్ట్‌ ప్లేయర్‌ను సౌతాఫ్రికాలో దింపనున్నాడు రోహిత్‌ శర్మ. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఓడిపోవడంతోనే వెంటనే స్పెషల్‌ బౌలర్‌ను సౌతాఫ్రికాకు రావాలని పిలుపునిచ్చాడు. ఆ స్పెషలిస్ట్‌ బౌలర్‌ ఎవరో కాదు.. ఆవేశ్‌ ఖాన్‌. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆవేశ్‌ ఖాన్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో ఏకంగా 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే చివరిదైన మూడో వన్డేలో రెండు వికెట్లు తీసి రాణించాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్ట్‌ సిరీస్‌లో మిగిలిన రెండో టెస్ట్‌ కోసం ఆవేశ్‌ఖాన్‌కు పిలుపొచ్చింది.

సౌతాఫ్రికా పిచ్‌లు పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా.. వారికి శార్ధుల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ నుంచి సరైన సపోర్ట్‌ లభించడం లేదు. అందుకోసమే.. రెండో టెస్ట్‌కు ప్రసిద్ధ్‌ లేదా శార్దుల్‌లో ఒకరిని పక్కనపెట్టి ఆవేశ్‌ఖాన్‌ను ఆడించాలని రోహిత్‌ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆవేశ్‌ను హుటాహుటిన సౌతాఫ్రికా రావాలని పిలుపు వచ్చింది. మరి ఆవేశ్‌ ఖాన్‌ రాకతోనైనా.. టీమిండియా తలరాత మారుతుందో లేదో చూడాలి. మరి రెండో టెస్ట్‌ కోసం పేస్‌ బౌలింగ్‌లో పదును పెంచాలని ఆవేశ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.