అమెరికాలో టీమిండియాకు అవమానం! సీరియస్‌ అయిన హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌

Cantiague Park, Team India, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌కు సిద్ధం అయ్యేందుకు ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే అవమానం ఎదురైంది. ఈ విషయంపై ద్రవిడ్‌ సీరియస్‌ అయినట్లు కూడా తెలుస్తోంది. మరి ఆ అవమానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Cantiague Park, Team India, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌కు సిద్ధం అయ్యేందుకు ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే అవమానం ఎదురైంది. ఈ విషయంపై ద్రవిడ్‌ సీరియస్‌ అయినట్లు కూడా తెలుస్తోంది. మరి ఆ అవమానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రస్తుతం టీమిండియా అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు అమెరికాకు వెళ్లింది. జూన్‌ 5 ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో రోహిత్‌ సేన తమ వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. అయితే.. మొదటి మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్‌ కోసం.. శుక్రవారం భారత జట్టు తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించింది. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా టీమిండియాకు అవమానం జరిగినట్లు సమాచారం. నెట్‌ ప్రాక్టీస్‌ కోసం నామమాత్రపు ఏర్పాట్లు చేయడమే ఇందుకు కారణం. ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న టీమ్‌.. వరల్డ్‌ కప్‌లో భాగంగా చేపట్టిన ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇలాంటి చెత్త ఏర్పాట్లు చేస్తారా అంటూ టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

అమెరికాలోని కాంటియాగ్ పార్క్‌లో టీమిండియా ఆటగాళ్లు తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించారు. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో వరల్డ్‌ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా పాల్గొన్నారు. తొలుత క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేసిన భారత ఆటగాళ్లు తర్వాత.. బౌలింగ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా, యశస్వి జైస్వాల్‌, బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌, రింకూ సింగ్‌, శుబ్‌మన్‌ గిల్‌ లాంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తే.. జడేజా, శివమ్‌ దూబే, ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మెద్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అలాగే రిషభ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ ఇంకా ఇక్కడి రాని విషయం తెలిసిందే.

ఇంత మంది భారత స్టార్‌ ఆటగాళ్లు తమ వరల్డ్‌ కప్‌ సన్నాహాకాలు చేస్తుంటే.. కనీసం సరైన ఏర్పాట్లు చేయలేదు. ఇదే విషయంపై ఆటగాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. అక్కడున్న వారిని టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చాలా సీరియస్‌గానే అడినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే.. ఈ విషయంపై బయటికి రావడంపై మాత్రం ఐసీసీ అలెర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఏ టీమ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం అంటూ ఐసీసీ అధికారులు కూడా వెల్లడించారు. టీమిండియా లాంటి వరల్డ్‌ క్లాస్‌ టీమ్‌కు సరైన ఏర్పాట్లు చేయకపోవడం అంటే.. ఒకరకంగా అవమానించినట్లే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments